TS News: తెలంగాణలో థియేటర్లు బంద్..
ABN, Publish Date - May 15 , 2024 | 11:18 AM
Telangana: సినిమా అనేది సగటు ప్రేక్షకుడికి ఆహ్లాదం.. ఆనందాన్ని ఇస్తుంది. ప్రతీరోజు ఎంతో కష్టపడుతూ ఉండే మనిషికి సినిమా కొంత రిలీఫ్‌ను ఇస్తుందని చెప్పువచ్చు. వీకెండ్ వచ్చిందంటే చాలు చాలా మంది సినిమాలకు వెళుతుంటారు. మరి కొంతమంది తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయిన వెంటనే థియేటర్లకు పడుతుంటారు. అయితే ఇటీవల తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల కారణంగా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కాని పరిస్థితి. దీంతో థియేటర్లు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోయింది. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులకు తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ ఊహించని షాక్ ఇచ్చింది.
హైదరాబాద్, మే 15: సినిమా (Cinema) అనేది సగటు ప్రేక్షకుడికి ఆహ్లాదం.. ఆనందాన్ని ఇస్తుంది. ప్రతీరోజు ఎంతో కష్టపడుతూ ఉండే మనిషికి సినిమా కొంత రిలీఫ్‌ను ఇస్తుందని చెప్పువచ్చు. వీకెండ్ వచ్చిందంటే చాలు చాలా మంది సినిమాలకు వెళుతుంటారు. మరి కొంతమంది తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయిన వెంటనే థియేటర్లకు (Theaters) పడుతుంటారు. అయితే ఇటీవల తెలంగాణలో (Telangana) లోక్‌సభ ఎన్నికల కారణంగా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కాని పరిస్థితి. దీంతో థియేటర్లు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోయింది. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులకు తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ (Telangana Theaters Association) ఊహించని షాక్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో పది రోజులపాటు థియేటర్లు బంద్ కానున్నాయి.
AP Elections: ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదు.. ఎంతంటే?
ఆక్యుపెన్సీ తక్కువ ఉండటంతో తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు తాత్కాలిక విరామం ప్రకటించాయి. శుక్రవారం నుంచి పది రోజులపాటు షోలు వేయవద్దని తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు అలాగే ఇతర కారణాలతో ఇటీవల పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు. దీంతో సినిమా హాళ్ళకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. నగరాలతో పోలిస్తే పట్టణాలు అలాగే మండలాలలో ఇది మరింత దారుణంగా ఉందంటూ.. తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ ఈమేరకు నిర్ణయం తీసుకుంది.
ఇవి కూడా చదవండి...
Hyderabad: కునుకు లేకుండా పహారా..
CM Revanth Reddy: సచివాలయంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 15 , 2024 | 11:21 AM