ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Congress: కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విందు..

ABN, Publish Date - Dec 18 , 2024 | 07:14 AM

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బుధవారం కాంగ్రెస్ నేతలకు తాజ్ దక్కన్ హోటల్‌లో విందు ఇస్తున్నారు. ఆయన టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి 100 రోజులు దాటిన సందర్భంగా డిన్నర్ పార్టీ ఇస్తున్నారు.

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు (TPCC Chief) మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) బుధవారం కాంగ్రెస్ నేతలకు (Congress Leaders) తాజ్ దక్కన్ హోటల్‌ (Taj Deccan Hotel)లో విందు ఇవ్వనున్నారు. టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి 100 రోజులు దాటిన సందర్భంగా డిన్నర్ పార్టీ ఇస్తున్నారు. ఈ విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), మంత్రులు (Ministers) హాజరుకానున్నారు. అలాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ (Deepadas Munshi), ఎమ్మెల్యేలు (MLAs), ఎమ్మెల్సీలు (MLCs), ఎంపీలు, (MPs) ముఖ్య నేతలు పాల్గొంటారు.


కాంగ్రెస్ ఛలో రాజ్ భవన్..

కాగా బుధవారం టీపీసీసీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్ నిరసన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ నిరసన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు పాల్గొంటారు. అదానీ, మణిపూర్ అంశాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనంపై దేశవ్యాప్త నిరసనలకు ఏఐసీసీ పిలుపిచ్చింది. ఈరోజు ఉదయం 11 గంటలకు ఛలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహిస్తారు. నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద భారీ జన సమీకరణకు కాంగ్రెస్ కసరత్తు చేసింది. ఇందిరా గాంధీ విగ్రహం నుండి రాజ్‌భవన్‌కు ర్యాలీగా కాంగ్రెస్ నేతలు వెళ్లనున్నారు.

ప్రదర్శన కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొననున్నారు. అమెరికాలో గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకలు దేశవ్యాపార, ఆర్థిక రంగాన్ని, పరువును దెబ్బతీసాయని కాంగ్రెస్ విమర్శించింది. అవినీతి, మోసం, మనీ లాండరింగ్, మార్కెట్ మానిప్యూలేషన్ లాంటి అంశాలలో అదానీ దేశ ప్రతిష్టను దెబ్బతీసారని కాంగ్రెస్ ఆరోపించింది. మణిపూర్‌లో వరసగా జరిగిన అల్లర్లు, విద్వంసాలపై ప్రధాని మోదీ స్పందించకపోవడంపై కాంగ్రెస్ నిరసన కార్యక్రమానికి పిలుపిచ్చింది.


గౌతమ్‌ అదానీ ఆర్థికంగా అవకతవకలకు పాల్పడి దేశ ప్రతిష్టను దెబ్బతీయడం, మణిపూర్‌లో అల్లర్లు జరిగినా ప్రధాని మోదీ ఇప్పటి దాకా ఆ రాష్ట్రాన్ని సందర్శించక పోవడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం జరగనుంది. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ ఆధ్వర్యంలో జరిగే ఈ చలో రాజ్‌భవన్‌ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. కాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని హైదరాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. ఆ ఎన్నికల్లో మెజారిటీ డివిజన్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని కార్యకర్తలకు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వచ్చే ఎన్నికల్లోపు 20 లక్షల మందికి ఉద్యోగాలు

రోగుల చెంతకే వైద్య సేవలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 18 , 2024 | 07:14 AM