ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TS News: ఫైర్‌మెన్ అభ్యర్థుల పాసింగ్ఔట్ పరేడ్.. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్

ABN, Publish Date - Jul 26 , 2024 | 09:42 AM

Telangana: తెలంగాణ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖలో భర్తీ అయిన 483 మంది ఫైర్‌మెన్ అభ్యర్థులకు శిక్షణ పూర్తి అయ్యింది. తెలంగాణ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వీరంతా నాలుగు నెలల పాటు శిక్షణ పొందారు. వారి శిక్షణ పూర్తి అవడంతో నేడు 483 మంది ఫైర్ మెన్ అభ్యర్థులు పాసింగ్ ఔట్ పరేడ్ చేయనున్నారు.

Telangana Disaster Management, Fire Department,

హైదరాబాద్, జూలై 26: తెలంగాణ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖలో భర్తీ అయిన 483 మంది ఫైర్‌మెన్ అభ్యర్థులకు శిక్షణ పూర్తి అయ్యింది. తెలంగాణ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వీరంతా నాలుగు నెలల పాటు శిక్షణ పొందారు. వారి శిక్షణ పూర్తి అవడంతో నేడు 483 మంది ఫైర్ మెన్ అభ్యర్థులు పాసింగ్ ఔట్ పరేడ్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridharbabu) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

Jasprit Bumrah: రోహిత్ శర్మ-పాండ్యా కెప్టెన్సీ వివాదంపై తొలిసారి స్పందించిన జస్ప్రీత్ బుమ్రా


సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల చేతుల మీదగా 157మంది డీవోపీ (డ్రైవర్ ఆపరేటర్)లు నియామక పాత్రలు అందుకోనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక భారీ స్థాయిలో జరిగిన నియామకాలను సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే ఫైర్ మెన్ అభ్యర్థులందరికి ఒకేసారి శిక్షణ పూర్తి అయ్యింది. శిక్షణలో భాగంగా ట్రైనీలకు వరదలు, భూకంపాలు, విపత్తులు, అగ్నిప్రమాదాలు, రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలు సమర్థవంతంగా ఎదుర్కొనేలా నైపుణ్యంతో కూడిన శిక్షణను అందించారు. తెలంగాణ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లి, హైదరాబాద్‌లో వీరికి శిక్షణ అందించారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఎంపికైన అభ్యర్థులకి గత మార్చి నెలలో శిక్షణ ప్రారంభం కాగా... నేటికి పూర్తి అయ్యింది. అభ్యర్థులకు అధునాతన పరికరాలు, అగ్నిమాపక యంత్రాలు, వరదలను సమర్ధవంతంగా ఎదురుకునేల గజ ఇతగాళ్లతో స్విమ్మింగ్ శిక్షణ పొందారు. ఇతర రాష్ట్రాలు బీహార్, నాగపూర్ శిక్షనార్థులకు కూడా రెండు బ్యాచుల్లో శిక్షణ అందజేశారు. తెలంగాణలో 225 మంది డీవోపీలకు శిక్షణ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

AP Assembly Session: జగన్‌ బాధితులూ లేచి నిలబడండి


కాగా... ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తెలంగాణ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ తక్షణం అందుబాటులో ఉంటారు. సమాచారం అందిన వెంటనే వారు అక్కడకు చేరుకుని అక్కడి వారిని కాపాడుతుంటున్నారు. సాధ్యమైనంతగా ప్రాణనష్టం జరగకుండా సమయస్పూర్తితో వ్యవహరిస్తూ అనేక మంది ప్రాణాలను రక్షిస్తుంటారు. అగ్నిప్రమాదాలు జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించడం వారు వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేస్తుంటారు. తెలంగాణ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖలో ఉద్యోగాల కోసం అనేక మంది ఉత్సుకత చూపుతుంటారు. చివరకు ఎంతో కష్టపడి కోర్సులు పూర్తి చేసి... పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా కఠినమైన శిక్షణలు తీసుకుని ఉద్యోగాలను సంపాదిస్తుంటారు. విధి నిర్వహణలో భాగంగా తమకు సాధ్యమైనంత వరకు ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ప్రయత్నిస్తుంటారు.


ఇవి కూడా చదవండి...

ఫైళ్ల దహనం కేసు సీఐడీకి!

పారిస్‌ ఒలింపిక్స్‌ నేటినుంచే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 26 , 2024 | 09:45 AM

Advertising
Advertising
<