Revanth Reddy: ఒకటి మోదీ పరివార్.. రెండోది గాంధీ పరివార్..: సీఎం రేవంత్ రెడ్డి
ABN, Publish Date - Nov 11 , 2024 | 01:55 PM
దేశ ప్రజలకు మెరుగైన విద్య అందించేందుకు ఆనాడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ముస్లింలను మేము ఓటర్లుగా చూడటంలేదని, సోదరులుగా, కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మైనారిటీని కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకోలేదని, అందుకే మైనారిటీ మంత్రి ఇచ్చే అవకాశం లేకుండా పోయిందన్నారు.
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress)ను అధికారంలోకి తీసుకురావడంలో మైనారిటీలు (Minorities) కీలక పాత్ర పోషించారని, హిందూ (Hindu), ముస్లింలు (Muslims) తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Govt.,) రెండు కళ్లలాంటి వారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. మీరంతా అండగా ఉంటే విద్య, వైద్యం, ఉపాధి విషయంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించుకుందామని అన్నారు. సోమవారం రవీంద్రభారతిలో జాతీయ విద్యా దినోత్సవం, మైనార్టీ సంక్షేమ దినోత్సవ వేడుకలు జరిగాయి... ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఉన్నవి రెండే పరివార్లు అని, ఒకటి మోదీ పరివార్ (Modi Parivar).. రెండోది గాంధీ పరివార్ (Gandhi Parivar) అని అన్నారు. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు మోదీ పరివార్ పనిచేస్తోందని, దేశ సమైక్యతకు గాంధీ పరివార్ కృషి చేస్తోందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
దేశ ప్రజలకు మెరుగైన విద్య అందించేందుకు ఆనాడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ముస్లింలను మేము ఓటర్లుగా చూడటంలేదని, సోదరులుగా, కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మైనారిటీని కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకోలేదని, అందుకే మైనారిటీ మంత్రి ఇచ్చే అవకాశం లేకుండా పోయిందన్నారు. కానీ షబ్బీర్ అలీని ప్రభుత్వ సలహాదారులుగా చేసామని, అమీర్ అలీ ఖాన్‌కు ఎమ్మెల్సీ ఇచ్చామని, కార్పొరేషన్ పదవులు ఇచ్చామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరువాత ఇప్పటి వరకు సీఎంవోలో మైనారిటీ అధికారిని నియమించలేదని, మన ప్రభుత్వంలో సీఎంవోలో ఒక మైనారిటీ అధికారిని నియమించామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో మైనారిటీలకు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందన్నారు. మోదీ పరివార్‌తో ఉండాలో.. గాంధీ పరివార్‌తో ఉండాలో మీరే నిర్ణయించుకోండన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చేందుకు మైనారిటీలు కృషి చేయాలని పిలుపిచ్చారు. దేశంలో కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని, మహారాష్ట్రలో మహావికాస్ అగాడి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. దేశంలో మోదీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధానిగా చూసే వరకు విశ్రమించొద్దని సీఎం రేవంత్ రెడ్డి పిలుపిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చంద్రబాబు మాటల వెనుక ఉన్న రహస్యం ఇదే
ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదు..
జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో ఆగ్రహం...
అమరావతికి నిధులపై త్రైపాక్షిక చర్చలు ..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 11 , 2024 | 01:55 PM