Share News

Jani Master Case: జానీ మాస్టర్‌ కేసులో కీలక పరిణామం.. రిమాండ్ విధింపు

ABN , Publish Date - Sep 20 , 2024 | 01:58 PM

తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న 21 ఏళ్ల యువతిపై జానీ మాస్టర్ అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Jani Master Case: జానీ మాస్టర్‌ కేసులో కీలక పరిణామం.. రిమాండ్ విధింపు

హైదరాబాద్: తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న 21 ఏళ్ల యువతిపై జానీ మాస్టర్ అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జానీ మాస్టర్‌కు అక్టోబర్ 3 వరకు రిమాండ్ విధిస్తూ ఉప్పర్‌పల్లి కోర్ట్ తీర్పునిచ్చింది. మొత్తం 14 రోజులు రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయస్థానం వెల్లడించింది. మరి కాసేపట్లో పోలీసులు ఆయనను చెంచలగూడ జైలుకు తరలించనున్నారని తెలుస్తోంది. జానీ మాస్టర్‌పై ఫోక్స్ యాక్ట్ కింద కేసు నమోదవడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో ఆయన తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ వేయనున్నారని సమాచారం.


జానీ మాస్టర్‌పై నమోదైన అత్యాచారం కేసులో దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇవాళ ఉదయం పోలీసులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. జాయ్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేపించారు. అనంతరం ఆయనను రాజేంద్రనగర్‌ సీసీఎస్‌‌కు తరలించారు. అక్కడి నుంచి ఉప్పర్‌పల్లి కోర్టుకు తీసుకెళ్లి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. నిన్న (గురువారం) గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు.


జానీ ప్రశ్నించేందుకు సమయం దొరక్కపోవడంతో పోలీసులు కస్టడీకి కోరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన 21 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు జానీ మాస్టర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ఆయనపై అత్యాచారం కేసు నమోదయింది. కేసు విషయం తెలుసుకొని ఆయన పరారయ్యారు. బెంగళూరు గుండా గోవా వెళ్లారు. రంగంలోకి దిగిన పోలీసులు గోవాలో ఉన్నట్టు ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు గోవాలో గురువారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్‌ తీసుకుని.. హైదరాబాద్‌ తీసుకొచ్చారు. జానీ మాస్టర్‌పై ఈ నెల 15న రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో లైంగిక వేధింపులకు సంబంధించి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదయింది. అదే రోజున నార్సింగ్‌ పోలీసులు మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అనంతరం బాధితురాలి వాంగ్మూలాన్ని సేకరించారు.


ఇవి కూడా చదవండి..

YSRCP Attack: కంచికచర్ల ఘటన మరవక ముందే.. పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు..

Narayana: ఇది లక్షల భక్తుల సమస్య.. సుప్రీం విచారణ చేయాలి

Read LatestAP NewsANdTelugu News

Updated Date - Sep 20 , 2024 | 02:37 PM