ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Uttam: BRS పాలనలో ప్రజాధనం దుర్వినియోగం

ABN, Publish Date - Jan 19 , 2024 | 09:58 PM

సీతారామ ప్రాజెక్టు భారీ కుంభకోణమని.. స్వతంత్ర భారతదేశంలో ఇంతటి భారీ కుంభకోణం చూడలేదని.. ఈ ప్రాజెక్టులో వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister Uttam Kumar Reddy ) అన్నారు.

హైదరాబాద్: సీతారామ ప్రాజెక్టు భారీ కుంభకోణమని.. స్వతంత్ర భారతదేశంలో ఇంతటి భారీ కుంభకోణం చూడలేదని.. ఈ ప్రాజెక్టులో వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister Uttam Kumar Reddy ) అన్నారు. శుక్రవారం సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టుపై అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అబద్ధాలు చెప్పారన్నారు. 2014లో మరో 14 వందల కోట్లు ఖర్చు చేస్తే అయిపోయే ప్రాజెక్టును.. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్న పూర్తి కాలేదని.. 7500 కోట్లు అదనంగా ఖర్చు చేశారన్నారు. 3లక్షలకు పైగా ఆయకట్టుకు నీళ్లు అప్పుడే వచ్చేది...కానీ ఇప్పటికీ ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు. సీతారామ ప్రాజెక్టుకు 18వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. రెండు, మూడు రోజుల్లో సీతారామ సాగర్ ప్రాజెక్టును మంత్రుల బృందంతో కలిసి పరిశీలిస్తామని చెప్పారు. రోజు రోజుకూ ఈ ప్రాజెక్టుపై ఆరోపణలు వస్తునే ఉన్నాయన్నారు. ప్రభుత్వం కేబినెట్‌లో చర్చించి వీటిపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటి కేటాయింపుల్లో ఒక్క చుక్క తెలంగాణకు తీసుకురాలేదని మండిపడ్డారు.

కేఆర్ఎంబీకి ఆ ప్రాజెక్టులు ఇవ్వట్లేదు

పదేళ్లలో ఒక్క ప్రాజెక్టుకు సైతం సరైన ఫార్మాట్‌లో జాతీయ హోదా కోసం అప్లై చెయ్యలేదన్నారు. జాతీయ హోదా స్టేటస్ అనేది దేశంలో ఎక్కడా ఇవ్వలేదని గజేంద్ర సింగ్ శాఖవత్ తమతో చెప్పారని గుర్తు చేశారు. KRMBకి ప్రాజెక్టులు అప్పగించడానికి ప్రభుత్వం ఒప్పుకోలేదన్నారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులపై కేంద్రం చర్చలు జరిపిందని.. తాము సమాధానం చెప్పలేదన్నారు. బీఆర్ఎస్ నేతలు చెప్పే మాటలు అన్నీ అబద్ధాలేనని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి హరీష్‌రావు స్టేట్మెంట్‌లో నిజం లేదన్నారు. కృష్ణా వాటర్ గురించి బీఆర్ఎస్ ( BRS ) వాళ్లకు మాట్లాడే హక్కు లేదని చెప్పారు. కృష్ణా వాటర్ వాటా గత ప్రభుత్వంలోనే తగ్గిందన్నారు. రాష్ట్రం అమూల్యమైన సంపద BRS పాలన వల్ల వృథా అయిందన్నారు. ఏ ప్రాజెక్టు చూసినా పైసల కోసమే తప్ప నీళ్ల కోసం ఏం చర్యలు తీసుకోలేదన్నారు. KRMB విషయంలో అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకుంటామని.. చట్టప్రకారం చర్యలు ఉంటాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.

Updated Date - Jan 19 , 2024 | 09:58 PM

Advertising
Advertising