TS Assembly: ‘మీ భాష నచ్చలే’.. సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్
ABN, Publish Date - Feb 14 , 2024 | 01:08 PM
Telangana: తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అధికార పక్షం నేతల భాషను నిరసిస్తూ సభ నుంచి గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చేశారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 14: తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) వాకౌట్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అధికార పక్షం నేతల భాషను నిరసిస్తూ సభ నుంచి గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చేశారు.
అసలేం జరిగిందంటే...
నిన్న నల్గొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడిన భాషపై సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు రాకుండా కేసీఆర్ పారిపోయారు అంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు. ‘‘కేసీఆర్ నిన్న మాట్లాడిన భాషపై చర్చ చేద్దామా? కాళేశ్వరం, గోదావరి జలాలపై చర్చకు మేం సిద్దం. రేపు సాయంత్రం వరకైనా సమయం ఇస్తున్నాం. కేసీఆర్ సభకి వచ్చి చర్చలో పాల్గొనాలి. కేసీఆర్కు నిజాయితీ ఉంటే సభకి వచ్చి చర్చ చేయాలి. సచ్చిన పామును ఎవరైనా చంపుతారా? కేసీఆర్ పారిపోయి ఫామ్ హౌజ్లో దాకున్నారు. కేసీఆర్ నిన్న మాట్లాడింది ఏం భాష? ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం పీకడానికి వెళ్ళాడు అని అంటారా? మొన్నటి ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ పాంటు లాగారు. ఇక జనం కేసీఆర్ చొక్కా కూడా లాగేస్తారు. సభకి రావాల్సిన నాయకుడు సభకి రాకుండా ముఖ్యమంత్రిని తిడుతాడా?. మా ప్రభుత్వమే తప్పు చేసినట్టు గత ప్రభుత్వ మాట్లాడుతున్నారు. ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టిన డబ్బులు వృధా అయ్యాయి’’ అంటూ సీఎం వ్యాఖ్యలు చేశారు.
కాగా.. సభలో సీఎం రేవంత్ రెడ్డి భాషపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. సీఎం భాష పట్ల తమకు అభ్యంతరం ఉందన్నారు. సీఎంగా నిండు సభలో మట్లదకూడని భాష మాట్లాడటం సబబు కాదన్నారు. సీఎం గౌరవాన్ని కాపాడుకోవాలని హితవుపలికారు. సీఎం... రాజగోపాల్ రెడ్డిలా మాట్లాడకూడదన్నారు. కాంగ్రెస్ పార్టీలో చీడ పురుగు రాజగోపాల్ రెడ్డి అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ను చీట్ చేసింది రాజగోపాల్ రెడ్డి అంటూ కడియం శ్రీహరి వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Feb 14 , 2024 | 01:08 PM