ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth: ఐటీసీలుగా ఐటీఐలు

ABN, Publish Date - Jun 18 , 2024 | 05:33 PM

ప్రస్తుతం ఐటీఐల్లో విద్యార్థులకు నేర్పించే నైపుణ్యాలు ఉపయోగం లేకుండా పోయాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. 50 ఏళ్ల నాటి నైపుణ్యాలను ఐటీఐల్లో నేర్పిస్తున్నారని, అప్ గ్రేడ్ కావాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీఐలను ఐటీసీలుగా మారుస్తున్నామని ప్రకటించారు. ఇందుకోసం టాటా సంస్థ సహకారం తీసుకుంటున్నామని వెల్లడించారు. విద్యార్థులు, నిరుద్యోగులను నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నానని వివరించారు.

CM Revanth Reddy

హైదరాబాద్: ప్రస్తుతం ఐటీఐల్లో విద్యార్థులకు నేర్పించే నైపుణ్యాలు ఉపయోగం లేకుండా పోయాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అభిప్రాయ పడ్డారు. 50 ఏళ్ల నాటి నైపుణ్యాలను ఐటీఐల్లో నేర్పిస్తున్నారని, అప్ గ్రేడ్ కావాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీఐలను ఐటీసీలుగా మారుస్తున్నామని ప్రకటించారు. ఇందుకోసం టాటా సంస్థ సహకారం తీసుకుంటున్నామని వెల్లడించారు. విద్యార్థులు, నిరుద్యోగులను నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నానని వివరించారు. తన ఆలోచనల నుంచి వచ్చిందే ఏటీసీ సెంటర్స్ అని పేర్కొన్నారు. మేం పాలకులు, మీరు బానిసలు అనే ఆలోచన లేదు. మేం సేవకులం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


‘40 లక్షల మంది యువతీ యువకులు ఉపాధి లేక రిక్రూట్‌మెంట్ బోర్డుల చుట్టూ తిరుగుతున్నారు. సర్టిఫికెట్ ఉంటే సరిపోదు సాంకేతిక నైపుణ్యం ఉండాలి. సాంకేతిక నైపుణ్యం ఉంటే ఉపాధి లభిస్తుందని విశ్వసిస్తా. సర్టిఫికెట్స్ జీవన ప్రమాణాలు పెంచవు. గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్లకుండా ప్రభుత్వం ఉపాధి గ్యారంటీ ఇస్తుంది. టాటా సంస్థ సహకారంతో సాంకేతిక నైపుణ్యాల కోసం రూ.2,324 కోట్లతో 65 ఐటీఐలు ఐటీసీలుగా మారుస్తున్నాం. విద్యార్థుల శిక్షణ కోసం ముందుకు వచ్చిన టాటా యాజమాన్యానికి ధన్యవాదాలు. ఐటీ రంగంలో ప్రపంచంలో తెలుగు వారు పోటీ పడుతున్నారు. మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించడమే మా బాధ్యత. రాష్ట్రంలో గల 65 ఐటీఐలను అధునాతనంగా తీర్చిదిద్దుతాం. నైపుణ్యాలను నేర్పించి నిరుద్యోగులకు భరోసా కల్పిస్తాం. విద్యార్థిని విద్యార్థులు ఐటీఐల్లో చేరాలి. ఈ శాఖ తన వద్ద ఉంటుంది. నేనే స్వయంగా పర్యవేక్షిస్తా. ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తా అని’ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - Jun 18 , 2024 | 05:34 PM

Advertising
Advertising