FilmNagar: ఫిలింనగర్‌లో యువతి ఆత్మహత్య
ABN , Publish Date - Nov 12 , 2024 | 04:24 PM
యుడు తనతో సరిగ్గా మాట్లాడడం లేదంటూ సాప్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఫిలింనగర్‌లో చోటు చేసుకుంది. జమ్ము కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాకు చెందిన ఆమె.. హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తుంది.
హైదరాబాద్, నవంబర్ 12: ప్రియుడే సర్వస్వమని భావించింది. అతడితోనే లోకమనుకుంది. కానీ అతడు తనను క్రమక్రమంగా నిర్లక్ష్యం చేయడాన్ని ఆమె భరించలేక పోయింది.ఆ క్రమంలో ఫోన్ చేసినా.. అతడు తనతో సరిగ్గా మాట్లాడడం లేదని ఆ యువతి తీవ్ర మనోవేదనకు గురయ్యింది. దీంతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హైదరాబాద్‌లోని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Also Read: Attack on Collector: వికారాబాద్ ఘటనపై ఏడీజీ కీలక నివేదిక
జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని మాలపొర గ్రామానికి చెందిన ఇరామ్ నబీ దారు.. హైదరాబాద్‌లోని బ్యాంక్ ఆఫ్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తుంది. ఆ క్రమంలో షేక్ పేటలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఆమె అద్దెకు ఉంటుంది. నవంబర్ 8వ తేదీన స్నేహితుడు అబ్దుల్.. ఆమెకు ఫోన్ చేశారు. కానీ ఆమె ఎంతకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో సందేహించిన అతడు వెంటనే అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నాడు. ఆమె ఎంతకు తలుపు తీయక పోవడంతో.. వాచ్‌మెన్ సాయంతో తలుపు పగలకొట్టాడు.
Also Read: కాబూలీ శనగలు తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
నివాసంలో ఇరామ్ నబీ దారు.. ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే ఆత్మహత్యకు ముందు రోజు ఇరామ్ నబీ దారు.. కాశ్మీర్‌లోని తన ప్రియుడితో మాట్లాడినట్లు పోలీసుల నిర్ధారించారు. ప్రేమ విఫలం కావడంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రాధమిక అంచనా వేస్తున్నారు. ఇక ఆమె మృతిపై కాశ్మీర్‌లోని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
For Telangana News And Telugu News..