మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS News: వామ్మో.. ఈ మహిళ మామూలిది కాదుగా ఏకంగా యాంకర్‌నే..

ABN, Publish Date - Feb 23 , 2024 | 02:55 PM

Telangana: టీవీ ఛానల్ యాంకర్‌ను ఓ మహిళ కిడ్నాప్ చేయడం భాగ్యనగరంలో సంచలనంగా మారింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ యాంకర్‌ను త్రిష అనే మహిళ రూంలో బంధించింది. యాంకర్‌ను పెళ్లి చేసుకోవాలనే ఆత్రుతతో సదరు మహిళ ఈ నిర్వాకానికి పాల్పడింది. అయితే త్రిష చెర నుంచి ఎలాగోలా తప్పించున్న బాధితుడు ప్రణవ్.. పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

TS News: వామ్మో.. ఈ మహిళ మామూలిది కాదుగా ఏకంగా యాంకర్‌నే..

హైదరాబాద్, ఫిబ్రవరి 23: ఆమె ఒక బిజినెస్ ఉమెన్.. పలు స్టార్ట్‌ప్ కంపెనీలకు ఎండీగా కూడా ఉన్నారు. కోట్ల కొలది ఆస్తి ఉంది. అయితే ఆ మహిళ చేసిన ఒకే ఒక తప్పు జైలు పాలయ్యేలా చేసింది. ఇంతకీ ఆమె చేసిన నిర్వాకం ఏంటంటే...

ఇదీ జరిగింది...

టీవీ ఛానల్ యాంకర్‌ను ఓ మహిళ కిడ్నాప్ చేయడం భాగ్యనగరంలో (Hyderabad) సంచలనంగా మారింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ యాంకర్‌ను త్రిష అనే మహిళ రూంలో బంధించింది. యాంకర్‌ను పెళ్లి చేసుకోవాలనే ఆత్రుతతో సదరు మహిళ ఈ నిర్వాకానికి పాల్పడింది. అయితే త్రిష చెర నుంచి ఎలాగోలా తప్పించున్న బాధితుడు ప్రణవ్.. పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సదరు మహిళ డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్‌ను నడుపుతోంది. భారత్ మాట్రిమోన్లో ప్రణవ్ ఫోటోలు చూసి త్రిష్ ఇష్టపడ్డటు తెలుస్తోంది.

ఇక్కడే మరో ట్విస్ట్ బయటపడింది. ప్రణవ్ పేరుతో సైబర్ కేటుగాళ్లు నకిలీ ఐడీని క్రియేట్ చేశారు. దీంతో నిజంగానే ప్రణవ్ ఐడీ అనుకుని త్రిష ఇష్టపడింది. ప్రణవ్‌పై ఇష్టంతో ఏకంగా కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని మనసుపడింది. చివరకు ఆమె చేసిన నిర్వాకంతో జైలు ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రణవ్ ఫిర్యాదుతో కేసును నమోదు చేసిన ఉప్పల్‌ పోలీసులు... త్రిషను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. త్రిష ఐదు స్టార్ట్ అప్ కంపెనీలకు ఎండిగా ఉంది. అయితే కోట్ల కొలది ఆస్తిపరులైన త్రిష .. ప్రణవ్‌ను ఇష్టపడడంతో కిడ్నాప్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 23 , 2024 | 03:06 PM

Advertising
Advertising