AV Ranganath: మా ఇల్లు బఫర్ జోన్‌లో లేదు
ABN, Publish Date - Nov 25 , 2024 | 02:24 AM
యూసు్‌ఫగూడ సమీపంలోని మధురానగర్‌లో తాను నివసిస్తున్న ఇల్లు బఫర్‌జోన్ పరిధిలో లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టంచేశారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడి
హైదరాబాద్ సిటీ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): యూసు్‌ఫగూడ సమీపంలోని మధురానగర్‌లో తాను నివసిస్తున్న ఇల్లు బఫర్‌జోన్ పరిధిలో లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టంచేశారు. 1980లో తన తండ్రి సుబ్బయ్య ఆ ఇంటిని నిర్మించారని.. అప్పటి నుంచి అదే ఇంట్లో ఉంటున్నామని ఓ ప్రకటనలో తెలిపారు. కృష్ణకాంత్ పార్కు దిగువన వేల ఇళ్ల తర్వాత తమ ఇల్లు ఉందన్నారు. ‘మా ఇల్లు బఫర్‌జోన్‌లో ఉందని కొన్ని సామాజిక మాధ్యమాలతోపాటు పలు పేపర్లలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు.
ఒకప్పటి పెద్ద చెరువును రెండున్నర దశాబ్దాల క్రితం కృష్ణకాంత్ పార్కుగా అభివృద్ధి చేశారు. అయితే.. చెరువు కట్టకు దిగువన 10 మీటర్ల వరకే బఫర్ జోన్ ఉంది. 10 మీటర్లు దాటితే ఆ ప్రాంతం బఫర్‌జోన్ పరిధిలోకి రాదు. చెరువు కట్టకు దాదాపు కిలోమీటరు దూరంలో మా ఇల్లు ఉంది’ అని వివరించారు. కొందరు వ్యక్తులు తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తుండడాన్ని ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Updated Date - Nov 25 , 2024 | 02:24 AM