ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hydra Commissioner: హైడ్రా పేరుతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడితే జైలుకే:రంగనాథ్‌

ABN, Publish Date - Sep 05 , 2024 | 03:16 AM

హైడ్రాకు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరించినా.. అక్రమ వసూళ్లకు పాల్పడినా జైలు జీవితం తప్పదని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ హెచ్చరించారు.

హైదరాబాద్‌ సిటీ, జవహర్‌నగర్‌, మౌలాలి, కీసర రూరల్‌, సెప్టెంబరు, 4 (ఆంధ్రజ్యోతి) : హైడ్రాకు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరించినా.. అక్రమ వసూళ్లకు పాల్పడినా జైలు జీవితం తప్పదని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ హెచ్చరించారు. గత కొద్ది రోజులుగా ట్రై కమిషనరేట్‌ పరిధిలో హైడ్రా విభాగం విస్తృతంగా అక్రమ నిర్మాణాల తొలగింపులు చేపడుతున్న నేపథ్యంలో కొంతమంది సామాజిక కార్యకర్తల ముసుగులో బఫర్‌ జోన్‌, ఎఫ్‌.టి.ఎల్‌ పరిధిలో లేదా వాటి పరిసరాల్లో నిర్మాణం చేపడుతున్న బిల్డర్లను, ఇళ్ల నిర్మాణదారులను బెదిరిస్తున్నారు. ఇది అక్రమ నిర్మాణమని, బఫర్‌ జోన్‌, ఎఫ్‌.టి.ఎల్‌ పరిధిలో నిర్మిస్తున్నారని.. హైడ్రాకు ఫిర్యాదు చేస్తామని, కూల్చేవేసేంత వరకు వదిలిపెట్టమని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు.


ఎవరైనా రెవెన్యూ ఉద్యోగులమనిగానీ, మున్సిపల్‌, నీటి పారుదల విభాగాలతో పాటు హైడ్రా విభాగానికి చెందిన అధికారులం అంటూ బెదిరింపులకు పాల్పడితే మొదట స్థానిక పోలీ్‌సస్టేషన్‌లోగానీ, పోలీస్‌ కమిషనర్‌ లేదా ఎస్పీకి ఫిర్యాదు చేయాలని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ సూచించారు. కాగా మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ పాటు మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు బుధవారం పలు ప్రాంతాలను పరిశీలించారు. అంబేడ్కర్‌నగర్‌ చెరువు(ఇందిరమ్మ చెరువు) ఎఫ్‌టీఎల్‌ ప్రాంతాల్లో పలు అక్రమ నిర్మాణాలు గుర్తించారు.


జవహర్‌నగర్‌ మాజీ మేయర్‌ కావ్య ఫామ్‌హౌజ్‌పై ఫిర్యాదు రావడంతో వచ్చిన హైడ్రా అధికారులతో మాజీ మేయర్‌ మాట్లాడారు. జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని అక్రమనిర్మాణాలు, కమర్షియల్‌ స్థలాలపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. మల్కాజిగిరి సర్కిల్‌ గౌతంనగర్‌ డివిజన్‌ మిర్జాలగూడలోని చిన్మయమార్గ్‌లో రోడ్డును ఆక్రమించి చే పట్టిన నిర్మాణాలను కమిషనర్‌ బుధవారం పరిశీలించారు. అలాగే మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్‌ పరిధిలోని దమ్మాయి చెరువును రెవెన్యూ, ఇరిగేషన్‌, మున్సిపల్‌ అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్‌ బుధవారం పరిశీలించారు. ఇక్కడ ప్లాట్లు విక్రయించిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.


  • హైడ్రా పేరుతో బెదిరిస్తే.. 1064కు సమాచారం ఇవ్వండి: ఏసీబీ

హైదరాబాద్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): చెరువులను, నాలాలను ఆక్రమించి ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఇదే అదునుగా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులు గతంలో వచ్చిన ఫిర్యాదులు, నోటీ్‌సల్ని చూపించి హైడ్రాకు ఫిర్యాదు చేస్తామని బిల్డర్లను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఎవరైనా హైడ్రా పేరు చెప్పి డబ్బులు డిమాండ్‌ చేస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. టోల్‌ ఫ్రీ నెంబరు 1064కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ చీఫ్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు.

Updated Date - Sep 05 , 2024 | 03:16 AM

Advertising
Advertising