ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Smita Sabharwal: చిక్కుల్లో ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు

ABN, Publish Date - Jul 22 , 2024 | 11:29 AM

ట్రైనీ IAS అధికారిణి పూజా ఖేద్కర్ వివాదం తర్వాత ఇప్పుడు UPSC సివిల్ సర్వీసెస్ ఎంపిక విధానం గురించి కొత్త చర్చ మొదలైంది. ఈ వివాదం నేపథ్యంలో తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఎఎస్ అధికారిణి స్మితా సబర్వాల్(Smita Sabharwal) ఐఎఎస్‌లో వికలాంగుల కోటాపై కామెంట్లు చేయగా, నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

Smita Sabharwal

ట్రైనీ IAS అధికారిణి పూజా ఖేద్కర్ వివాదం తర్వాత ఇప్పుడు UPSC సివిల్ సర్వీసెస్ ఎంపిక విధానం గురించి కొత్త చర్చ మొదలైంది. ఈ వివాదం నేపథ్యంలో తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్(Smita Sabharwal) ఐఏఎస్‌లో వికలాంగుల కోటాపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా ఖాతా 'ఎక్స్'లో పంచుకున్నారు. ఈ చర్చ ప్రస్తుతం ఊపందుకుంది. వైకల్యం ఉన్న పైలట్‌ను ఎయిర్‌లైన్ నియమించుకుంటుందా? లేదా మీరు వైకల్యం ఉన్న సర్జన్‌ని విశ్వసిస్తారా. #AIS ( IAS/ IPS/IFoS) అనేది ఫీల్డ్ వర్క్, పన్నులు విధించడం, ప్రజల మనోవేదనలను నేరుగా వినడం వంటివి ఉంటాయి. కాబట్టి ఈ ప్రీమియర్ సర్వీస్‌కు ఈ కోటా అవసరమా అని తన అభిప్రాయాలను వెల్లడించారు.


విమర్శలు

ఇది చూసిన నెటిజన్లు(netizens) తీవ్రంగా స్పందిస్తున్నారు. వికలాంగుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న కార్యకర్తలు ఈ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. వికలాంగులను 'సంకుచిత దృక్పథం'తో చూడరాదని, వారి అర్హతపై ఇలా మాట్లాడటం సరికాదని అంటున్నారు. దీనిపై శ్రీకాంత్ మిర్యాల అనే రచయిత, సైకియార్టిస్ట్ ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఈ పోస్టులో ప్రత్యక్ష ఉదాహరణలతో గతంలో ఎంబీబీఎస్ చదివేటప్పుడు తన ప్రిన్సిపాల్ కాలుకి పోలియో సోకి సరిగా నడవలేనివారు, అయినా కూడా ఎడమచేత్తో రాసి, పాఠాలు చెప్పారాని గుర్తు చేశారు. ఇలా అనేక మంది దివ్యాంగులు పలు రంగాల్లో ఉన్నట్లు గుర్తు చేశారు.


సరికాదు

అంతేకాదు ఉన్నత స్థానంలో ఉన్న అధికారులు(officers) ఇలా ట్వీట్ చేయడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు. మీ పని మీరు సరిగ్గా చేయండి చాలు. అంతేకానీ మీకు సలహాలు ఇచ్చే స్థాయి ఇంకా రాలేదని చెబుతున్నారు. అంతేకాదు గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ దగ్గర పనిచేసిన ఈ అధికారిణిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌పై అనుచిత ప్రవర్తన ఆరోపణల మధ్య ఈ వివాదం మొదలైంది. యూపీఎస్‌సీ పరీక్షలో తన అభ్యర్థిత్వాన్ని పొందేందుకు వైకల్యం, ఇతర వెనుకబడిన తరగతి (నాన్-క్రీమీ లేయర్) కోటాను దుర్వినియోగం చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఫేక్ ఐడెంటిటీ ఇచ్చి అనుమతించిన దానికంటే ఎక్కువ ప్రయత్నించారనే ఆరోపణలపై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఖేద్కర్‌పై కేసు నమోదు చేసింది.


ఇవి కూడా చదవండి..

Bhadrachalam: ఉగ్రరూపం దాల్చిన గోదావరి

Parliament Sessions: బలమైన ప్రతిపక్షం, మిత్రపక్షాల డిమాండ్‌లు.. మోదీకి విషమ పరీక్ష!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 22 , 2024 | 12:15 PM

Advertising
Advertising
<