ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Electric Bike: ఒక్కసారి చార్జ్‌ చేస్తే.. 170 కి.మీ ప్రయాణం

ABN, Publish Date - Oct 26 , 2024 | 04:36 AM

ఐఐటీ-హెచ్‌ స్టార్టప్‌ సంస్థ ప్యూర్‌ ఈవీ ఇట్రి్‌స్ట-ఎక్స్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది 5-6 గంటలు చార్జింగ్‌ పెడితే 90 కి.మీ. వేగంతో 171 కి.మీ. వెళుతుందని ప్యూర్‌ ఈవీ వ్యవస్థాపకుడు నిశాంత్‌ దొంగరి తెలిపారు.

  • బైక్‌ను విడుదల చేసిన ప్యూర్‌ ఈవీ

  • ఐఐటీ-హెచ్‌లో స్టార్టప్‌ ఇన్వెస్టర్ల సదస్సు

కంది, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఐఐటీ-హెచ్‌ స్టార్టప్‌ సంస్థ ప్యూర్‌ ఈవీ ఇట్రి్‌స్ట-ఎక్స్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది 5-6 గంటలు చార్జింగ్‌ పెడితే 90 కి.మీ. వేగంతో 171 కి.మీ. వెళుతుందని ప్యూర్‌ ఈవీ వ్యవస్థాపకుడు నిశాంత్‌ దొంగరి తెలిపారు. ఈ బైక్‌లోని బీఎల్‌డీసీ హబ్‌ మోటారు తక్కువ వోల్టేజీ కరెంటు ఉన్నా.. చార్జ్‌ అవుతుందని చెప్పారు. బ్యాటరీలో తక్కువ చార్జింగ్‌ ఉన్నా.. పిక్‌పలో తేడా రాదని అన్నారు. బండి పంక్చర్‌ అయితే సెన్సార్లు గుర్తిస్తాయని.. రైడర్‌ బండి దిగి బ్యాటరీ సహాయంతో బండిని నెమ్మదిగా తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. దీనికి రివర్స్‌ మోడ్‌ కూడా ఉందని వెల్లడించారు. ఈ బైక్‌ ధర రూ.1.40 లక్షలు ఉంటుందని తెలిపారు.


స్టార్టప్‌ సంస్థలు, వ్యాపార పెట్టుబడిదారులను ఒక వేదికపైకి తీసుకురావడానికి సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌లో శుక్రవారం ప్యూర్‌ఈవీ-వీసీ సర్కిల్‌ సంస్థలు సంయుక్తంగా ది పిచ్‌ పేరుతో స్టార్టప్‌ ఇన్వెస్టర్ల సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 35 మంది విదేశీ పెట్టుడిదారులతో పాటు 130 మంది వ్యవస్థాపకులు, 60 స్టార్టప్‌ సంస్థలు హాజరయ్యాయి. స్టార్టప్‌ సంస్థలకు నిధుల సమీకరణ లక్ష్యంగా నిర్వహించిన ఈ సమ్మిట్‌లో ఆటోమొబైల్‌ రంగంలో స్టార్టప్‌ సంస్థలకు ఉన్న అవకాశాలు, పెట్టుబడిదారులు తదితర అంశాలపై స్టార్టప్‌ సంస్థల ప్రతినిధులు చర్చించారు. అనంతరం వీసీ సర్కిల్‌ ప్రతినిధులతో కలిసి ప్యూర్‌ఈవీ వ్యవస్థాపకుడు నిశాంత్‌ దేశవ్యాప్త ఎలక్ట్రిక్‌ వాహనాలకు సంబధించిన వైట్‌ కాలర్‌ను విడుదల చేశారు.

Updated Date - Oct 26 , 2024 | 04:36 AM