KTR: అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్, రాజగోపాల్‌రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ..
ABN, First Publish Date - 2024-02-08T13:37:37+05:30
తెలంగాణ అసెంబ్లీ అవరణలో మాజీ మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. రాజగోపాల్ రెడ్డిని చూసిన కేటీఆర్ ‘మీకు మంత్రి పదవి ఎప్పుడు వస్తుంది?’ అని ప్రశ్నించారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ అవరణలో మాజీ మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. రాజగోపాల్ రెడ్డిని చూసిన కేటీఆర్ ‘మీకు మంత్రి పదవి ఎప్పుడు వస్తుంది?’ అని ప్రశ్నించారు. మీ లానే మాకు ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతుందని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఫ్యామిలీ పాలన కాదు.. మంచిగా పని చేస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయని కేటీఆర్ అన్నారు. ఎంపీగా మీ కూతురు కీర్తి పోటీ చేస్తుందా.. సంకీర్త్ పోటీ చేస్తున్నారా? అని కేటీఆర్ అడిగారు. దయచేసి తనను కాంట్రవర్సీలోకి లాగవద్దంటూ రాజగోపాల్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
హోంమంత్రిని కావాలని ఉంది..
ఇక అనంతరం అసెంబ్లీ లాబీలో రాజగోపాల్ రెడ్డి మీడియాతో కాసేపు చిట్ చాట్ చేశారు. కేసీఆరే దగ్గరుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి పంపుతారన్నారు. వాళ్ళను వాళ్ళు కాపాడుకోడానికి బీజేపీలో బీఆర్ఎస్ వాళ్లు చేరుతారన్నారు. తనకు హోం మంత్రి కావాలని ఉందని.. బీఆర్ఎస్ వాళ్లను జైలుకు పంపాలని కోరికగా ఉందన్నారు. కేసీఆర్‌ని గద్దె దించేందుకు కాంగ్రెస్‌కి వచ్చానని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.
Updated Date - 2024-02-08T13:39:15+05:30 IST