ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మూసీ ప్రక్షాళనలో ఇజ్రాయెల్‌ సాంకేతిక పరిజ్ఞానం

ABN, Publish Date - Nov 30 , 2024 | 03:29 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ఇజ్రాయెల్‌ సంసిద్ధత వ్యక్తం చేసిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు.

  • ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల

  • ఇజ్రాయెల్‌ రాయబారి తో సమావేశం

హైదరాబాద్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ఇజ్రాయెల్‌ సంసిద్ధత వ్యక్తం చేసిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు. భారత్‌లో ఇజ్రాయెల్‌ రాయబారి రువెన్‌ అజర్‌ .. మంత్రితో సమావేశం అయ్యారు. మూసీ ప్రాజెక్టు, వ్యర్థ జలాల పునర్వినియోగ సాంకేతికతలో తమకు సహకరించాలని శ్రీధర్‌ బాబు కోరారు. ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ, శిక్షణనిచ్చే వారికి ఆధునిక శిక్షణలో సహకారం అందించాలన్నారు. కృత్రిమ మేథ, సైబర్‌ సెక్యూరిటీలో ఇజ్రాయెల్‌ అగ్రగామిగా ఉందని, ఆ రంగాల్లో తెలంగాణకు సహకరించాలన్నారు. కాగా తుర్కియె రాయబారి ఫిరట్‌ సునెల్‌ కూడా మంత్రి శ్రీధర్‌ బాబుతో సచివాలయంలో భేటీ అయ్యారు.


  • స్కిల్‌ వర్సిటీలో ‘విప్రో’ భాగస్వామి కావాలి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్‌ ఇండియా స్కిల్‌ వర్సిటీలో విప్రో భాగస్వామి కావాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు కోరారు. విప్రో ప్రధాన ఆర్థిక అధికారి రాఘవ్‌ స్వామినాథన్‌ శ్రీధర్‌ బాబును కలిశారు. ఐటి, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో పేరు గడించిన విప్రో తమ సంస్థకు అవసరమయ్యే మానవ వనరులకు స్కిల్‌ యూనివర్సిటీలో స్వయంగా శిక్షణ ఇచ్చి నియమించుకోవాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో ఎస్‌పీఎఫ్‌ పాత్ర ఎంతో కీలకమైనదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కొనియాడారు. శుక్రవారం అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 265మంది కానిస్టేబుళ్ల దీక్షాంత్‌ పరేడ్‌కు ముఖ్య అంతిథిగా హాజరై గౌరవం వందనం స్వీకరించారు.

Updated Date - Nov 30 , 2024 | 03:29 AM