ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ పంచ్‌లు.. ఏమన్నారంటే?

ABN, Publish Date - Sep 11 , 2024 | 10:25 AM

సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ గాల్లో దీపంలా మారిందని పంచ్‌లు వేశారు.

CM Revanth vs KTR

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ గాల్లో దీపంలా మారిందని పంచ్‌లు వేశారు. ‘‘సార్లు లేని బడులు, లెక్చరర్లు లేని కాలేజీలు, చివరకు చాక్ పీసులు-డస్టర్లు లేని స్కూల్స్, అద్దె చెల్లించలేదని కాలేజీలకు తాళాలు, రోడ్లపైకి విద్యార్థులు’’ అంటూ ఎక్స్ వేదికగా ఆయన విమర్శలు గుప్పించారు. పాఠశాలలు ప్రారంభమై నెలలు గడుస్తున్నా గ్రాంట్స్ విడుదల చెయ్యకపోవడం సిగ్గుచేటు అని ఆయన కేటీఆర్ ఎద్దేవా చేశారు.


విద్యా శాఖకు మంత్రి లేడని, శాఖను దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి దిక్కు లేడని కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘పదుల సంఖ్యలో ఢిల్లీకి చెక్కర్లు కొట్టే ముఖ్యమంత్రి.. మీ సొంత నియోజకవర్గంలో అధ్యాపకులు లేక విద్యార్థులు టీసీలు తీసుకొని వెళ్లిపోతున్నారు. తక్షణం విద్యా శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష జరిపి సమస్యలపై దృష్టి పెట్టండి. పిల్లల బంగారు భవిష్యత్‌తో చెలగాటం వద్దు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.


మంచి నీళ్లను కూడా వదలని జూటా కాంగ్రెస్

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి.. బీఆర్ఎస్ పథకాలపై ప్రతాపం చూపిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదోడి బతుకు ఆగమాగం అవుతోందని అన్నారు. తాము ప్రకటించిన గృహ జ్యోతి పథకానికి తూట్లు పొడిచిన కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ అమలు చేసిన 20 వేల లీటర్ల ఉచిత మంచి నీరు పథకంపై కుట్రలు చెయ్యడం సిగ్గు చేటు అని ఆరోపించారు. ‘‘ఒక వైపు రుణమాఫీ కాలేదు. డబ్బులు కట్టండి అని రైతులకు నోటీసులు. మరో వైపు నిరుపేదల ఇండ్లకు హైడ్రా నోటీసులు. ఇప్పుడు నల్లా బిల్లు అంటూ డోర్లకు బిల్లులు అతికించడం’’ అని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్ వేదికగా స్పందించారు.

Updated Date - Sep 11 , 2024 | 10:34 AM

Advertising
Advertising