ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jagadeesh Reddy: సచివాలయంలో కాదు.. గాంధీభవన్‌లో పెట్టుకోండి

ABN, Publish Date - Dec 09 , 2024 | 03:33 AM

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని తాము అంగీకరించేది లేదని, ఆ విగ్రహాన్ని సచివాలయంలో కాకుండా కాంగ్రెస్‌ కార్యాలయం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసుకోవాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి అన్నారు.

  • తెలంగాణ తల్లి విగ్రహ మార్పును అంగీకరించం: జగదీశ్‌ రెడ్డి

నల్లగొండ, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని తాము అంగీకరించేది లేదని, ఆ విగ్రహాన్ని సచివాలయంలో కాకుండా కాంగ్రెస్‌ కార్యాలయం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసుకోవాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ అంటే రేవంత్‌ రెడ్డికి వణుకు వస్తోందని, అందుకే సీఎం అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. శనివారం నల్లగొండలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రారంభోత్సవాలన్నీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలో ప్రారంభించినవేనని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రాజెక్టుల కోసం ఒక్క రూపాయి కూడా వెచ్చించలేదని ఆరోపించారు.

Updated Date - Dec 09 , 2024 | 03:33 AM