Jagga Reddy: కాంగ్రెస్ అంటేనే సామాజిక న్యాయం.. సమానత్వం
ABN, Publish Date - Sep 09 , 2024 | 03:28 AM
కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం.. సమానత్వమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు.
సీఎం రేవంత్‌ది రెడ్డి సామాజిక వర్గం
డిప్యూటీ సీఎంది ఎస్సీ సామాజికవర్గం
టీపీసీసీ చీఫ్ మహే్‌షకుమార్.. బీసీ
మూడు ప్రధాన సామాజిక వర్గాలకు 3 కీలక పదవులు ఇచ్చిన అధిష్ఠానం
కాంగ్రె్‌సలో కష్టపడ్డ వారికి అవకాశాలు
మహే్‌ష నియామకమే దీనికి నిదర్శనం
స్వేచ్ఛగా చెప్పే అవకాశం కాంగ్రె్‌సలోనే
ప్రాంతీయ పార్టీల్లో అలా ఉండదు
బీజేపీలో ఎప్పుడు పదవి వస్తుందో.. పోతుందో తెలియదు: తూర్పు జగ్గారెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం.. సమానత్వమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. పార్టీలోని మూడు కీలక పదవులను అధిష్ఠానం.. మూడు ప్రధాన సామాజిక వర్గాలకు ఇచ్చిందని చెప్పారు. సీఎం రేవంత్‌ది రెడ్డి సామాజిక వర్గం కాగా.. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఎస్సీ వర్గానికి చెందిన వారని పేర్కొన్నారు. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన మహే్‌షకుమార్‌గౌడ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారన్నారు. కాంగ్రె్‌సలో కష్టపడిన వారికి అవకాశాలు ఉంటాయని, టీపీసీసీ చీఫ్‌గా మహే్‌షకుమార్‌గౌడ్ నియామకం దీనికి నిదర్శనమని చెప్పారు.
గాంధీభవన్‌లో శనివారం మీడి యా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. సోనియాగాంధీ నాయకత్వం, రాహుల్.. మల్లికార్జున ఖర్గేల సారధ్యంలో మహే్‌షకుమార్‌గౌడ్‌ను అధిష్ఠానం.. టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించిందన్నారు. బీసీ సామాజిక వర్గానికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడం మంచి పరిణామమని పేర్కొన్నారు. పీసీసీ చీఫ్ కోసం బీసీ సామాజిక వర్గం నుంచి మహేష్ గౌడ్, మధుయాష్కీ పేర్లు, ఎస్సీల నుంచి సంపత్‌కుమార్ పేరుపైన, ఎస్టీల నుంచి బలరాం నాయక్ పేరును పరిశీలించారని చెప్పారు. సోనియా, రాహుల్, ప్రియాంక, రేవంత్, భట్టి, ఉత్తమ్‌ల సహకారంతో టీపీసీసీ చీఫ్‌గా మహే్‌షకుమార్‌గౌడ్ పేరును కేసీ వేణుగోపాల్ ప్రకటించారన్నారు. సీఎం, సీనియర్ మంత్రులు.. పీసీసీ చీఫ్ కలిసి సమన్వయంతో పార్టీని ముందుకు తీసుకెళ్తారని ధీమా వ్యక్తం చేశారు.
టీపీసీసీ చీఫ్ కావాలన్న ఆలోచన మారదు
జగ్గారెడ్డికి.. టీపీసీసీ చీఫ్ కావాలన్న ఆలోచన మా రేది లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇలా స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం కాంగ్రె్‌సలోనే ఉంటుందన్నారు. రెడ్డిలకు టీపీసీసీ చీఫ్ పదవి ఇప్పుడు ఇవ్వొద్దని ఏఐసీసీ అనుకుందని, అందుకే బీసీకి ఇచ్చిందని చెప్పారు. రెడ్డిలకు ఇవ్వాలనుకున్నప్పుడు జగ్గారెడ్డి చర్చలోకి వస్తాడన్నారు. బీజేపీలో పదవి ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియదన్నారు. ప్రాంతీయ పార్టీల్లోనైతే వేరేవాళ్లకు అవకాశమే ఉండదని, తండ్రి.. లేకుంటే కొడుకే అధ్యక్షుడవుతారన్నారు.
నెహ్రూతోనే వెనుకబడిన కులాల అభివృద్ధి
దేశంలో వెనుకబడిన కులాల అభివృద్ధికి విత్తనం నాటిందే నెహ్రూ అని జగ్గారెడ్డి అన్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న కులాల అభివృద్ధికి నెహ్రూ, ఇందిరలు ప్రోత్సాహాన్ని అందించారని చెప్పారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
Updated Date - Sep 09 , 2024 | 03:28 AM