JNTU: జేఎన్‌టీయూకు కొత్తగా 74 మంది జూనియర్ అసిస్టెంట్లు
ABN, Publish Date - Nov 23 , 2024 | 05:11 AM
హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో దాదాపు 30 ఏళ్ల తర్వాత జూనియర్ అసిస్టెంట్ల నియామకం జరిగింది. టీజీపీఎస్సీ గ్రూప్-4 పరీక్ష ద్వారా ఎంపికైన 74 మంది అభ్యర్థులను ప్రభుత్వం జేఎన్‌టీయూకు కేటాయించింది.
30 ఏళ్ల తర్వాత తొలిసారి నియామకాలు
హైదరాబాద్ సిటీ, నవంబరు 22 (ఆంఽధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో దాదాపు 30 ఏళ్ల తర్వాత జూనియర్ అసిస్టెంట్ల నియామకం జరిగింది. టీజీపీఎస్సీ గ్రూప్-4 పరీక్ష ద్వారా ఎంపికైన 74 మంది అభ్యర్థులను ప్రభుత్వం జేఎన్‌టీయూకు కేటాయించింది. వారంతా శుక్రవారం ధ్రువ పత్రాల పరిశీలనకు వర్సిటీకి వచ్చారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. 1991లో అప్పటి ప్రభుత్వం జేఎన్‌టీయూకు 89 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కారుణ్య నియామకం ద్వారా 15 మంది 1994లో విధుల్లో చేరారు. అప్పట్నించి మిగిలిన 74 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఎట్టకేలకు మళ్లీ ఇన్నాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను కేటాయించడంతో వర్సిటీ ఉన్నతాధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Nov 23 , 2024 | 05:11 AM