JNTU: గ్రీన్ టెక్నాలజీస్ అభివృద్ధిపై హెచ్‌సీయూ, జేఎన్‌టీయూ ఉమ్మడి పరిశోధనలు
ABN, Publish Date - Nov 30 , 2024 | 06:02 AM
గ్రీన్ అండ్ సస్టెయినబుల్ టెక్నాలజీ్‌సను అభివృద్ధి చేయడంపై హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంతో కలిసి పరిశోధనలు నిర్వహించేందుకు జేఎన్‌టీయూ సన్నద్ధమవుతోంది.
పెయిర్ ప్రోగ్రామ్ కింద రూ.100కోట్లు ఇవ్వనున్న కేంద్రం
హైదరాబాద్ సిటీ, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): గ్రీన్ అండ్ సస్టెయినబుల్ టెక్నాలజీ్‌సను అభివృద్ధి చేయడంపై హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంతో కలిసి పరిశోధనలు నిర్వహించేందుకు జేఎన్‌టీయూ సన్నద్ధమవుతోంది. ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధనలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన పార్ట్‌నర్‌షిప్ ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్స్ అండ్ రీసెర్చ్ (పెయిర్) కార్యక్రమం కింద ఈ రెండు విశ్వవిద్యాలయాలు సమష్టిగా పనిచేసేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. జేఎన్‌టీయూ, హెచ్‌సీయూ సంయుక్తంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు పెయిర్ కార్యక్రమం కింద కేంద్రం సుమారు రూ.100కోట్లు మంజూరు చేయనుందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా పరిశోధన /అభివృద్ధి చేయాల్సిన సాంకేతికతలపై రెండ్రోజులపాటు జేఎన్‌టీయూ
Updated Date - Nov 30 , 2024 | 06:02 AM