ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nagarjun: టీజీఈఆర్‌సీ చైర్మన్‌గా జస్టిస్‌ నాగార్జున్‌!

ABN, Publish Date - Oct 08 , 2024 | 04:14 AM

తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ) చైర్మన్‌గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ దేవరాజు నాగార్జున్‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

  • నియామకానికి సీఎం రేవంత్‌ అంగీకారం

  • 29న బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్‌, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ) చైర్మన్‌గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ దేవరాజు నాగార్జున్‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత ఫైలుపై సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే సంతకం చేయగా.. త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వనపర్తికి చెందిన జస్టిస్‌ నాగార్జున్‌... వనపర్తి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌, ఆర్‌ఎల్‌డీ కాలేజీలో బీఎస్సీ, గుల్బర్గాలోని ఎస్‌ఎ్‌సఎల్‌ కాలేజీలో ఎల్‌ఎల్‌బీ చదివారు. అంతర్జాతీయ న్యాయ శాస్త్రంపై ఉస్మానియా వర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం చేశారు. అమెరికాలోనూ న్యాయశాస్త్రంలో పలు కోర్సులు అభ్యసించారు. 1986లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొన్న ఆయన.. 1991 మే 1వ తేదీన జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు.


2004లో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా పదోన్నతి పొందారు. 2019 సెప్టెంబరు 17వ తేదీన కామారెడ్డి జిల్లా జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. 2022 అక్టోబరు 18న హైకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. 2023 ఏప్రిల్‌ 6న మద్రాసు హైకోర్టుకు బదిలీ కాగా.. అక్కడే పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం టీజీఈఆర్‌సీ చైౖర్మన్‌గా పని చేస్తున్న తన్నీరు శ్రీరంగారావుతోపాటు ఇద్దరు సభ్యుల పదవీ కాలం ఈనెల 29న ముగియనుంది. కమిషన్‌ను ఖాళీగా ఉంచకుండా.. అదే రోజు సాయంత్రం కొత్త చైర్మన్‌గా జస్టిస్‌ డి.నాగార్జున్‌ బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలిలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను డిస్కమ్‌లు దాఖలు చేసిన ఏఆర్‌ఆర్‌, వీలింగ్‌ చార్జీలు, టారిఫ్‌ ప్రతిపాదనలపై విచారణ జరుగుతోంది. ప్రస్తుత కమిటీ ఈనెల 24వ తేదీన చివరి బహిరంగ విచారణ జరపనుంది.

Updated Date - Oct 08 , 2024 | 04:14 AM