Justice L. Narasimha Reddy : విద్యుత్ కమిషన్ గడువు నెల రోజులు పెంపు
ABN, Publish Date - Jul 03 , 2024 | 04:05 AM
విద్యుత్ రంగంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణకు ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి కమిషన్ గడువును ఈనెల 31వ తేదీ దాకా పొడిగిస్తూ ....
ఈ నెల 31లోగా నివేదిక ఇవ్వండి: ఇంధన శాఖ
కేసీఆర్‌పై వేచిచూసే ధోరణి
విద్యుత్ కమిషన్ గడువు
జూలై 31లోగా నివేదిక ఇవ్వండి: ఇంధన శాఖ
హైదరాబాద్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ రంగంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణకు ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి కమిషన్ గడువును ఈనెల 31వ తేదీ దాకా పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటిలోగా నివేదిక ఇవ్వాలని కోరింది. బీఆర్‌ఎస్ సర్కారు కుదుర్చుకున్న ఛత్తీ్‌సగఢ్ విద్యుత్ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లను నామినేషన్ ప్రాతిపదికన అప్పగించడంపై విచారణకు..
ప్రస్తుత సర్కారు మార్చి 14న ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నివేదిక ఇవ్వడానికి జూన్ 30ని గడువుగా నిర్ణయించింది. అయితే.. జస్టిస్ నర్సింహారెడ్డి ఏప్రిల్ 7న ప్రారంభించిన విచారణ ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం అది కీలకదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో.. గడువును మరో నెలరోజులపాటు పెంచుతున్నట్టు ఇంధనశాఖ విద్యుత్ కమిషన్‌కు సమాచారం ఇచ్చింది. కాగా.. కేసీఆర్ నిర్ణయాల వల్లే విద్యుత్ రంగానికి నష్టం జరిగిందని కమిషన్‌కు పలువురు నివేదించారు. ఈ నేపథ్యంలో.. జూన్ 19న వారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కేసీఆర్‌కు కమిషన్ లేఖ రాసింది. ఆయన అందుకు ముందుకు రాకపోవడంతో.. జూన్ 29తో ఆ గడువు ముగిసినట్లు కమిషన్ భావించింది. కేసీఆర్ విషయంలో మరికొద్దిరోజులపాటు వేచిచూసే ధోరణి అవలంబించాలని నిర్ణయించింది.
Updated Date - Jul 03 , 2024 | 04:05 AM