ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Justice Pinaki Chandra Ghosh: జనవరిలో కేసీఆర్‌, హరీశ్‌రావు వంతు!

ABN, Publish Date - Dec 12 , 2024 | 04:26 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ ఈ నెల 17న హైదరాబాద్‌కు రానున్నారు. ఈనెల 24వరకు హైదరాబాద్‌లోనే ఉండి విచారణ చేపట్టనున్నారు.

  • విచారణకు పిలువనున్న కాళేశ్వరం కమిషన్‌

హైదరాబాద్‌, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ ఈ నెల 17న హైదరాబాద్‌కు రానున్నారు. ఈనెల 24వరకు హైదరాబాద్‌లోనే ఉండి విచారణ చేపట్టనున్నారు. తొలుత మాజీ ఈఎన్‌సీలు సి.మురళీధర్‌, నల్లా వెంకటేశ్వర్లు, ఈఎన్‌సీ బి.హరిరామ్‌లను.. ఆ తర్వాత సీఎంవో మాజీ కార్యదర్శి స్మితా సభర్వాల్‌, మాజీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శులు ఎస్‌కే జోషి, సోమేశ్‌కుమార్‌, మాజీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసే అవకాశాలున్నాయి.


ఈ నెల 18 లేదా 19న క్రాస్‌ ఎగ్జామినేషన్‌ పునఃప్రారంభంకానుంది. ఇక, వచ్చే జనవరిలో మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావులను కమిషన్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు పిలవనుంది. మరోవైపు ఫిబ్రవరిలో కమిషన్‌ తన నివేదికను ప్రభుత్వానికి అందించే అవకాశాలున్నట్టు సమాచారం. ఈ నెలాఖరుతో కమిషన్‌ విచారణ గడువు ముగియనుంది. కాగా, విద్యుత్‌ విచారణ నివేదికను ఇప్పటికే జస్టిస్‌ మదన్‌ భీంరావు లోకూర్‌ ప్రభుత్వానికి అందజేశారు. ఆ నివేదికపై త్వరలోనే ప్రభుత్వం మంత్రివర్గంలో చర్చించి శాసనసభలో చర్చకు పెట్టనుంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరంపై నివేదికను త్వరలోనే సమర్పించడానికి పీసీ ఘోష్‌ సమాయత్తమవుతున్నారు.

Updated Date - Dec 12 , 2024 | 04:26 AM