ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కులగణనపై సర్కారు అబద్ధాలు!

ABN, Publish Date - Nov 26 , 2024 | 03:50 AM

కులగణన సర్వేపై రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇప్పటికీ 70 శాతం ఇళ్లకు స్టిక్కర్లే వేయలేదని, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో సర్వే పూర్తికాలేదని అన్నారు.

  • 70% ఇళ్లకు ఇంకా స్టిక్కర్లే వేయలేదు

  • నెలలో సర్వే నివేదిక ఎలా ఇస్తారు?

  • ప్రాంతీయ పార్టీలతోనే బీసీలకు న్యాయం: కవిత

హైదరాబాద్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): కులగణన సర్వేపై రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇప్పటికీ 70 శాతం ఇళ్లకు స్టిక్కర్లే వేయలేదని, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో సర్వే పూర్తికాలేదని అన్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం 90 శాతం సర్వే పూర్తయిందంటూ అసత్యాలు చెబుతోందని విమర్శించారు. కులగణనపై నెలరోజుల్లో నివేదిక ఇస్తామని ప్రభుత్వం చెబుతుండడంపై ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయన్నారు. సోమవారం కవిత బీసీ రిజర్వేషన్ల ప్రత్యేక (డెడికేటెడ్‌) కమిషన్‌ చైర్మన్‌ బి.వెంకటేశ్వరరావును కలిసి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రూపొందించిన సమగ్ర నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్‌ 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు.


ప్రాంతీయ పార్టీల ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందని, తమిళనాడులో జయలలిత హయాంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌, చంద్రబాబునాయుడు సమయంలో, ఆతర్వాత తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్‌ నాయకత్వంలో బీసీలకు న్యాయం జరిగిందని కవిత తెలిపారు. ఈ దేశాన్ని 55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ దేశంలో కులగణనను ఎందుకు చేపట్టలేదో రాహుల్‌గాంధీ చెప్పాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాము కులగణన చేపట్టబోమని సుప్రీంకోర్టులో 2021లో అఫిడవిట్‌ దాఖలు చేసిందని తెలిపారు. బీజేపీ డీఎన్‌ఏలోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక భావాలున్నాయని ఆరోపించారు. ఇదిలా ఉండగా. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతి చెందడం తనను కలచివేసిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్‌ అసమర్థ పరిపాలన మరో పేదబిడ్డ ప్రాణం తీసిందని, కన్నతల్లికి కడుపు కోత మిగిల్చిందని సోమవారం ‘ఎక్స్‌’ వేదికగా ఆమె విమర్శించారు. 11 నెలల్లో 43 మంది విద్యార్థుల ప్రాణాలు తీశారని, ఇవన్నీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యలేనని కవిత ఆరోపించారు.

Updated Date - Nov 26 , 2024 | 03:50 AM