ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కేటీఆర్‌కు జైలు భయం పట్టుకుంది: కడియం

ABN, Publish Date - Nov 18 , 2024 | 04:08 AM

అవినీతి, అక్రమాల విషయంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు జైలుకు వెళ్తామనే భయం పట్టుకుందని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు.

స్టేషన్‌ఘన్‌పూర్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): అవినీతి, అక్రమాల విషయంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు జైలుకు వెళ్తామనే భయం పట్టుకుందని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఆయన మాట్లాడుతూ... జైలుకు వెళ్లడం తప్పదని భావించి ‘అరెస్టు చేయండి, జైలుకు పంపండి’ అని కేటీఆర్‌ ప్రజల నుంచి సానుభూతి పొందే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.


పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ నిరంకుశపాలన కొనసాగించి రాష్ట్ర వనరులను కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబ చేసిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని పేర్కొన్నారు. రైతులను ఏనాడు పట్టించుకోని బీజేపీ రైతు రుణమాఫీపైన విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.

Updated Date - Nov 18 , 2024 | 04:08 AM