ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kaleshwaram: బ్యారేజీలను డ్యామ్‌లుగా గుర్తిస్తారా?

ABN, Publish Date - Dec 03 , 2024 | 04:58 AM

బ్యారేజీలను డ్యామ్‌లుగా ఏ విధంగా గుర్తించారు? 2019లో బ్యారేజీలు పూర్తయితే 2021లో జాతీయ ఆనకట్టల భద్రత చట్టం (ఎన్‌డీఎ్‌సఏ) వచ్చింది.. 2023 జూలైలో కాళేశ్వరం బ్యారేజీలను స్పెసిఫైడ్‌ డ్యామ్‌లుగా గుర్తించడం వెనుక ఆంతర్యం ఏమిటి?

మేడిగడ్డ ఎప్పుడు దెబ్బతింది?

  • ఎ్‌సడీఎ్‌సవో మాజీ ఎస్‌ఈపై కమిషన్‌ ప్రశ్నలు

  • అమెరికాలో ఉన్న అధికారితో వర్చువల్‌ విచారణ

  • నేడు కోల్‌కతాకు తిరిగి వెళ్లనున్న జస్టిస్‌ ఘోష్‌

హైదరాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): బ్యారేజీలను డ్యామ్‌లుగా ఏ విధంగా గుర్తించారు? 2019లో బ్యారేజీలు పూర్తయితే 2021లో జాతీయ ఆనకట్టల భద్రత చట్టం (ఎన్‌డీఎ్‌సఏ) వచ్చింది.. 2023 జూలైలో కాళేశ్వరం బ్యారేజీలను స్పెసిఫైడ్‌ డ్యామ్‌లుగా గుర్తించడం వెనుక ఆంతర్యం ఏమిటి? అని స్టేట్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ (ఎస్‌డీఎ్‌సవో)ను కాళేశ్వరం విచారణ కమిషన్‌ ప్రశ్నించింది. కాళేశ్వరంపై విచారణలో భాగంగా సోమవారం అమెరికాలో ఉన్న ఎస్‌డీఎ్‌సవో మాజీ ఎస్‌ఈ మురళీకృష్ణను వర్చువల్‌ విధానంలో కమిషన్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసింది. జాతీయ ఆనకట్టల భద్రత చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? అఫిడవిట్‌లో పేర్కొన్నదంతా వాస్తవమేనా? మీ విధులు బాధ్యత లేమిటి? అని కమిషన్‌ ప్రశ్నించగా 2021 డిసెంబరు 30వ తేదీన ఎన్‌డీఎ్‌సఏను నోటిఫై చేశామని బదులిచ్చారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను డ్యామ్‌లుగా పరిగణించారా? బ్యారేజీలను ఏ విధంగా డ్యామ్‌లుగా పరిగణించారు? అని ప్రశ్నించింది. దీనికి మురళీఽకృష్ణ బదులిస్తూ 15 మీటర్ల ఎత్తు కలిగి, నీటిని నిల్వ చేసే వాటితో పాటు చెక్‌డ్యామ్‌ల ఎత్తు 10 మీటర్లు దాటినా డ్యామ్‌లుగా పరిగణించాలని చట్టంలో ఉందని చెప్పారు. నీటిని మళ్లించడానికే బ్యారేజీలు కడతారు... మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను ఏ విధంగా డ్యామ్‌లుగా పరిగణించారని మళ్లీ కమిషన్‌ ప్రశ్నించింది.


జాతీయ ఆనకట్టల భద్రత చట్టం ప్రకారం స్పెసిఫైడ్‌ డ్యామ్‌లుగా బ్యారేజీలను నోటిఫై చేయడం జరిగిందని మురళీకృష్ణ వివరించారు. మీ విధులు, బాధ్యతలేమిటి? అని కమిషన్‌ ప్రశ్నించగా జాతీయ ఆనకట్టల భద్రత చట్టాన్ని అమలు కోసం పలు క్షేత్రస్థాయి అధికారులతో పలు వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి, ఆయా డ్యామ్‌లను సమగ్రంగా పరిశీలించి, నోటిఫై చేయించామని తెలిపారు. బ్యారేజీలు పూర్తయిందెప్పుడు? అని కమిషన్‌ ప్రశ్నించగా 2023లో స్పెసిఫైడ్‌ డ్యామ్‌లుగా నోటిఫై చేశామని గుర్తు చేశారు. చట్టం ఎప్పుడు వచ్చింది? 2021లో చట్టం వస్తే.. 2019లోనే బ్యారేజీ పూర్తయింది వాస్తవమా? కాదా.? అని ప్రశ్నించగా... అవును అని బదులిస్తూ... పదే పదే విజ్ఞప్తుల అనంతరం స్పెసిఫైడ్‌ డ్యామ్‌ల లిస్టులో బ్యారేజీలను చేర్చారని బదులిచ్చారు. మేడిగడ్డ ఎప్పుడు దెబ్బతింది? బ్యారేజీకి తొలి వరదలు ఎప్పుడొచ్చాయి? అని ప్రశ్నించగా... 2019లో వరదలొచ్చాయని, తొలుత సుందిళ్ల, అన్నారంలో బుంగలు (పేజీలు) ఏర్పడ్డాయని, ఆ తర్వాత మేడిగడ్డ దెబ్బతిందని, అయితే బ్యారేజీల అథారిటీ రిపోర్టు మాత్రం చేయలేదని మురళీకృష్ణ చెప్పారు. ఈ సందర్భంగా అమెరికాలోని ఏ రాష్ట్రంలో ఉన్నారు? అని కమిషన్‌ ప్రశ్నించగా... సియోటెల్‌లో అని బదులివ్వగా... స్వామి వివేకానందుడు సేద తీరిన వృక్షాన్ని పరిశీలించారా? అని అడుగుతూ వీలు చేసుకొని పరిశీలించాలని సూచించారు.


  • రెండో వారంలో మళ్లీ విచారణ

ఈ షెడ్యూల్‌లో క్రాస్‌ ఎగ్జామినేషన్‌ పూర్తి చేసిన జస్టిస్‌ ఘోష్‌, మంగళవారం కోల్‌కతాకు తిరిగి వెళ్లనున్నారు. రెండో వారంలో తిరిగి, హైదరాబాద్‌కొచ్చి ఈఎన్‌సీలతో పాటు మాజీ ఈఎన్‌సీలను ప్రశ్నించనున్నారు. ఇక కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలోనూ, ఆ బ్యారేజీల వైఫల్యానికి ప్రధాన కారణాల్లో ఒకటైన వాటిలో ఎక్కువ కాలం నీటి నిల్వకు ఆదేశాలు జారీ చేశారని కేసీఆర్‌, హరీశ్‌పై కమిషన్‌కు ఇప్పటికే ఫిర్యాదులు రావడంతో వీరిద్దరినీ జనవరిలో కమిషన్‌ క్రాస్‌ ఎగ్జామిన్‌ చేయనుంది.

Updated Date - Dec 03 , 2024 | 04:58 AM