ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kaleshwaram: నెలాఖరులో కేసీఆర్‌, హరీశ్‌కు పిలుపు!

ABN, Publish Date - Nov 19 , 2024 | 01:40 AM

కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణకు పిలవనుంది. వీరిద్దరినీ ఈ నెలాఖరున లేదా డిసెంబరు తొలివారం లో విచారించే అవకాశాలున్నాయి.

  • 21న రాష్ట్రానికి జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌

  • తొలుత ఐఏఎ్‌సలు, మాజీ ఐఏఎ్‌సల విచారణ

  • కాళేశ్వరం నిర్మాణంపై ఆరా తీయనున్న కమిషన్‌

హైదరాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణకు పిలవనుంది. వీరిద్దరినీ ఈ నెలాఖరున లేదా డిసెంబరు తొలివారం లో విచారించే అవకాశాలున్నాయి. 21న హైదరాబాద్‌ రానున్న జస్టిస్‌ ఘోష్‌.. వచ్చే నెల 5 దాకా ఇక్కడే ఉండనున్నారు. మాజీ సీఎ్‌సలు ఎస్‌కే జోషి, సోమే్‌షకుమార్‌, మాజీ ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, సీఎంవో మాజీ ఓఎస్డీ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించిన స్మితా సభర్వాల్‌, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును తొలుత కమిషన్‌ క్రాస్‌ ఎగ్జామిన్‌ చేయనుంది. ప్రాజెక్టు నిర్మాణంలో కీలక నిర్ణయాలు తీసుకున్నది ఎవరు? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు కట్టాలని నిర్ణయించిందెవరు?బ్యారేజీల వైఫల్యానికి కారణాలు ఏంటి? రీ ఇంజనీరింగ్‌తో కాళేశ్వరం ప్రాజెక్టును తెరమీదికి తేవడానికి కారణమేంటి? వంటి వివరాలను కమిషన్‌ సేకరించే అవకాశాలున్నాయి.


అనంతరం కేసీఆర్‌, హరీశ్‌రావుకు కమిషన్‌ సమన్లు పంపే అవకాశం ఉంది. అయితే, విచారణకు కేసీఆర్‌ హాజవు అవుతారా? లేక జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి కమిషన్‌కు లేఖ రాసినట్లుగా.. జస్టిస్‌ పీసీ ఘోష్‌కు లేఖ రాసి దూరంగా ఉంటారా? అన్న చర్చ సాగుతోంది. జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి స్థానంలో నియమితులైన జస్టిస్‌ మదన్‌ భీంరావు లోకూర్‌ కమిషన్‌ మాత్రం కేసీఆర్‌ను విచారణకు పిలవకుండానే నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇప్పుడు కూడా కేసీఆర్‌ విచారణకు రాకపోతే... ఆయన ఇచ్చే లేఖనే అభిప్రాయంగా పరిగణనలోకి తీసుకొని కాళేశ్వరం విచారణ నివేదిక ఇచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. డిసెంబరు నెలాఖరు లేదా వచ్చే జనవరి ఆఖరుకల్లా ప్రభుత్వానికి నివేదిక అందించడానికి జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. డిసెంబరు 5 కల్లా విచారణ పూర్తయితే... నివేదికను తయారు చేసే ప్రక్రియను కమిషన్‌ ప్రారంభించనుంది.

Updated Date - Nov 19 , 2024 | 01:40 AM