Bandi Sanjay: బీజేపీని ఓడించేందుకే రెండు పార్టీల కుట్రలు..
ABN, Publish Date - Feb 26 , 2024 | 10:52 AM
కరీంనగర్: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని.. బీజేపీని ఓడించేందుకే ఆ రెండు పార్టీల కుట్రలు చేస్తున్నాయని.. అసలు విషయం ఏంటో ప్రజలకు తెలుసునని.. మాకు పోటీ కాంగ్రెస్‌తోనేనని.. బీఆర్ఎస్‌ది మూడో స్థానమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
కరీంనగర్: కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీలు రెండూ ఒక్కటేనని.. బీజేపీ (BJP)ని ఓడించేందుకే ఆ రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయని.. అసలు విషయం ఏంటో ప్రజలకు తెలుసునని.. మాకు పోటీ కాంగ్రెస్‌తోనేనని.. బీఆర్ఎస్‌ది మూడో స్థానమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌వి చీకటి ఒప్పందాలని, పైకి మాత్రం ఆ రెండు పార్టీల నేతలు తిట్టుకుంటారని అన్నారు. కాంగ్రెస్ నేతలు అసత్యప్రచారాలు చేస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేసీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని అన్నారని, పోటీ చేశామా? దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలన్నారు.
కేంద్ర నాయకత్వం తెలంగాణ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఐదారు రోజులలో అభ్యర్థులను ప్రకటించబోతోందని బండి సంజయ్ తెలిపారు. గ్రామాలవారీగా ఏం అభివృద్ధి చేసింది.. కేంద్రం ఏ మేరకు నిధులు ఇచ్చింది.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు తదితర అంశాలతో ప్రజాహిత యాత్ర ప్రచారంలోకి వెళతామని, అలాగే నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రి చేయాలన్న ఆలోచనతో యాత్ర కొనసాగిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.
ఈడీ, సీబీఐతో బీజేపీకి సంబందం లేదని, ఎమ్మెల్సీ కవితపై ఆధారలుంటే చర్యలు తప్పవని బండి సంజయ్ అన్నారు. బిడ్డని కాపాడేందుకు కేసీఆర్ డిల్లీ వెళ్తారేమో.. సొంత ప్రయోజనాల కోసమే కేసీఆర్ ఢిల్లీకి వెళ్తారన్నారు. బీఆరెస్‌తో పొత్తు అంటే.. చెంపలు వాయించి.. చెప్పుతో కొడతామని బండి సంజయ్ అన్నారు.
Updated Date - Feb 26 , 2024 | 11:28 AM