Congress: తెలంగాణకు ఇచ్చిన హామీలు ప్రధాని మోదీ నెరవేర్చలేదు: మంత్రి పొన్నం
ABN, Publish Date - Apr 14 , 2024 | 01:08 PM
కరీంనగర్: తెలంగాణకు ఇచ్చిన హామీలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెరవేర్చలేదని, విభజన హామీలు ఎందుకు అమలు చెయ్యలేదని మంత్రి పొన్నం ప్రబాకర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు.
కరీంనగర్: తెలంగాణకు ఇచ్చిన హామీలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నెరవేర్చలేదని, విభజన హామీలు ఎందుకు అమలు చెయ్యలేదని మంత్రి పొన్నం ప్రబాకర్ (Minister Ponnam Prabhakar) బీజేపీ ఎంపీ (BJP MP) బండి సంజయ్ (Bandi Sanjay)ను ఉద్దేశించి ప్రశ్నించారు. పదేళ్ల విభజన హామీల అమలు నిర్లక్ష్యంపై మంత్రి పొన్నం ఆదివారం కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో దీక్ష (Initiation) చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క వైద్య కాలేజీ (Medical College) కూడా ఇవ్వడానికి మనసు రాలేదా? ఐదేళ్లు ఎంపీగా ఉండి ఏం చేశావ్ సంజయ్ అంటూ ప్రశ్నించారు.
కరీంనగర్ ఎంపీ అంటే ఒకప్పుడు గౌరవం ఉండేదని.. బండి సంజయ్ వల్ల కరీంనగర్ పరువు పోయిందని మంత్రి పొన్నం అన్నారు. సంజయ్ అవినీతి చేయడం వల్లే.. అధ్యక్ష పదవి పోయిందన్నారు. బండి సంజయ్.. ప్రధాని మోదీ పేరుతో ఓట్లు అడగాలని.. రాముని పేరుతో కాదని అన్నారు. అభివృద్ధి చేయండి అంటే.. ఇంటింటికీ రాముని ఫోటోలు, అక్షింతలు పంపిస్తారా? అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - Apr 14 , 2024 | 01:22 PM