Ponnam: గురుకుల హాస్టల్లో సమస్యల పరిష్కారానికి నిర్ణయం..
ABN, Publish Date - Aug 14 , 2024 | 12:45 PM
Telangana: రాష్ట్రంలో గురుకుల హాస్టల్లలో సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం జిల్లాలో హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ప్రతి జిల్లా కలెక్టరు, శాననసభ్యులు, విద్యశాఖ అధికారులు గురుకుల హాస్టళ్లను బాధ్యతగా సందర్శించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించామన్నారు.
సిద్దిపేట, ఆగస్టు 14: రాష్ట్రంలో గురుకుల హాస్టల్లలో సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. బుధవారం జిల్లాలో హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ప్రతి జిల్లా కలెక్టరు, శాననసభ్యులు, విద్యశాఖ అధికారులు గురుకుల హాస్టళ్లను బాధ్యతగా సందర్శించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించామన్నారు.
AP Politics: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్లాన్ ఇదేనా..?
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకులాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు స్థానిక నిధులతో ప్లాంటేషన్ పనులను పూర్తిచేయాలని ఆదేశించామన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం చర్చలు జరుపుతోందని.. త్వరలోనే విద్యార్థులకు శుభవార్త చెప్తామని తెలిపారు. విద్యారంగ సమస్యలకు 5,000 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. అసౌకర్యాలతో ఉన్న అన్ని విద్యాసంస్థలకు స్థలాల కేటాయింపు జరిపి పక్కా భవనల నిర్మాణం చేపడతామని తెలిపారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో 42 రైతు వేదికల ద్వారా యువ రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా... యువరైతులకు వ్యవసాయాధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం తరపున అవసరమైన రుణాలు ఇప్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గం యువరైతులకు వ్యవసాయ ఆధారిత పథకాలకు అవసరమైన రుణాలు ఇప్పించేందుకు తాను, యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
TG News: దత్తత పేరుతో హైడ్రామా... మనవడిని అమ్మేసిన నాయనమ్మ
CM Revanth: సీతారామ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్న సీఎం.. ముమ్మర ఏర్పాట్లు
Read Latest Telangana News And Telugu News
Updated Date - Aug 14 , 2024 | 12:55 PM