ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ponnam Prabhakar: కేటీఆర్‌కు మంత్రి పొన్నం స్ట్రాంగ్ కౌంటర్

ABN, Publish Date - Nov 11 , 2024 | 09:35 AM

Telangana: బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్ష పదవి, కార్యనిర్వహక పదవి , ప్రతిపక్ష పదవి బీసీ లకు, ఎస్సీలకు ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన బీఆర్‌ఎస్ మాట్లాడే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న కుల సర్వే దేశ వ్యాప్తంగా జరగాలని డిమాండ్ ఉందన్నారు.

Minister Ponnam Prabhakar

రాజన్న సిరిసిల్ల జిల్లా, నవంబర్ 11: బీసీలకు కాంగ్రెస్ ఒక్క హామీని నెరవేర్చలేదంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (Former Minister KTR) చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar)తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు బీసీల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు ఉందా అని ప్రశ్నించారు. కార్తీక సోమవారం సందర్భంగా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న సమగ్ర కుటుంబ సర్వే ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు కాదని స్పష్టం చేశారు.


బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్ష పదవి, కార్యనిర్వహక పదవి , ప్రతిపక్ష పదవి బీసీ లకు, ఎస్సీలకు ఇవ్వాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన బీఆర్‌ఎస్ మాట్లాడే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న కుల సర్వే దేశ వ్యాప్తంగా జరగాలని డిమాండ్ ఉందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు సర్వేపై అక్కడక్కడా అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ పార్టీల రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ప్రభావితం కావద్దని ప్రజలను మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. వేములవాడ రాజన్నను మంత్రి పొన్నంతో పాటు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు దర్శించుకున్నారు.


కేటీఆర్ వ్యాఖ్యలు ఇవే..

నిన్న (ఆదివారం) హనుమకొండలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీసీలను వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏడాది కిందట కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయటంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఓట్ల కోసం దొంగ హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ ఒక్క బీసీ డిక్లరేషన్‌ హమీ అయినా అమలు చేసిందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కులగణన పూర్తయిన తరువాత, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని, ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. తాము కులగణనను సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని చెప్పారు. 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ఇంటింటి సర్వేకు వచ్చే అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీయాలని పిలుపునిచ్చారు.


మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రైతులకు పంటపై బోనస్‌ రూ.500లు ఇస్తున్నామని రేవంత్‌రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఒక్క బీసీకైనా వడ్డీ లేని రూ.10లక్షల రుణం ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఐదేళ్లలో బీసీల సంక్షేమం కోసం ఏటా రూ.20వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్లు కేటాయిస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌.. తొలి ఏడాది బడ్జెట్‌లో కేవలం రూ.8వేల కోట్లే ప్రకటించిందని, అవికూడా ఇప్పటివరకు విడుదల చేయలేదని విమర్శించారు. బీసీ వెల్ఫేర్‌తో పాటు ఎంబీసీలకు మరో మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారని, తన క్యాబినెట్‌లో 18మంది మంత్రులను భర్తీ చేసుకునే చేతకాని సీఎం రేవంత్‌రెడ్డి అని, కొత్త మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తా.. అంటే ఎవరు నమ్ముతారని కేటీఆర్ ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి..

AP Assembly Budget Session: ఇది మర్యాదేనా జగన్‌!

Gold and Silver Rates Today: స్వల్పంగా తగ్గిన ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 11 , 2024 | 09:36 AM