ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS Politics: కాంగ్రెస్ ట్యాగ్ లైన్ అదే.. మంత్రి దామోదర కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Feb 02 , 2024 | 06:07 PM

కాంగ్రెస్ ట్యాగ్ లైన్ స్వేచ్ఛ, ఆత్మగౌరవం, ఉపాధి అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodara Rajanarsimha) తెలిపారు. శుక్రవారం నాడు ధర్మపురిలో మంత్రి రాజనర్సింహ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు.

జగిత్యాల: కాంగ్రెస్ ట్యాగ్ లైన్ స్వేచ్ఛ, ఆత్మగౌరవం, ఉపాధి అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodara Rajanarsimha) తెలిపారు. శుక్రవారం నాడు ధర్మపురిలో మంత్రి రాజనర్సింహ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ..తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నిర్వీర్యం అయ్యాయని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్రజలకు, మీడియాకు స్వేఛ్ఛ లభించిందని అన్నారు.

త్వరలో వైద్య శాఖలో నియమకాలు

తన జీవితంలో విద్య, వైద్యాన్ని మాత్రమే నమ్ముతానని తెలిపారు. నూతనంగా ఏర్పడ్డ మెడికల్ కాలేజీలలో బోధనా సిబ్బంది సమస్య నెలకొందన్నారు. ప్రమాణాలు బాగానే ఉన్న.. వ్యవస్థ బాగాలేదని చెప్పారు. వైద్య శాఖలో త్వరలో సిబ్బందిని నియమిస్తామని అన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం కోసం సింగరేణి సంస్థ సీఎస్సార్ నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తామన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన అరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు.

Updated Date - Feb 02 , 2024 | 06:07 PM

Advertising
Advertising