Sanjay: గంగారెడ్డి హత్యతో ఉద్రిక్త పరిస్థితులు
ABN, Publish Date - Oct 22 , 2024 | 02:44 PM
Telangana: మారు గంగారెడ్డి హత్యపై ఎమ్మెల్యే సంజయ్ ఆరా తీశారు. జగిత్యాల ఎస్పీకి ఎమ్మెల్యే ఫోన్ చేసి హత్య గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, హత్యలో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరినీ వదలొద్దని ఆదేశాలు జారీ చేశారు.
జగిత్యాల, అక్టోబర్ 22: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan reddy) ముఖ్య అనుచరుడు మారు గంగారెడ్డి (55) హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అనుచరుడి హత్యపై జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన అనుచరుడిని హత్య చేయడం అంటే తనను కూడా హత్య చేసినట్లే అని ఎమ్మెల్సీ అన్నారు. హత్యకు నిరసనగా ఆస్పత్రి వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. ఇదిలా ఉండగా... మారు గంగారెడ్డి హత్యపై ఎమ్మెల్యే సంజయ్ (MLA Sanjay) ఆరా తీశారు. జగిత్యాల ఎస్పీకి ఎమ్మెల్యే ఫోన్ చేసి హత్య గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, హత్యలో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరినీ వదలొద్దని ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారి పట్ల కఠినంగా వ్యవహరించండి అంటూ ఎస్పీకి ఎమ్మెల్యే సంజయ్ ఆదేశించారు.
Gottipati Ravikumar: ఏ సీఎం చేయని పనులు జగన్ చేశారు.. మంత్రి గొట్టిపాటి ఫైర్
గుండె తరుక్కుపోతోంది: జీవన్ రెడ్డి
మరోవైపు అనుచరుడి హత్యపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏబీఎన్ -ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సంతోషపడాలా.. నా మనుషులను చంపేస్తున్నారని బాధపడాలా. నా అనుచరుడిని చంపిన నిందితుడు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున డబ్బులు పంచాడు. బీఆర్ఎస్ నేతలకు అడ్డొస్తే భౌతికంగా దాడులు చేస్తున్నారు. నిందితుడు నా అనుచరుడిని చంపేస్తానని ముందే హెచ్చరించాడు. అంత హెచ్చరించినా పోలీసులు కనీసం పట్టించుకోలేదు. జరుగుతున్న పరిణామాలను తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది’’ అంటూ జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
దర్యాప్తు చేస్తున్నాం: డీఎస్పీ
హత్యపై డీఎస్పీ రఘుచందర్ ఏబీఎన్‌తో మాట్లాడారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని.. కుట్ర కోణంలో విచారణ జరుపుతున్నామని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ రఘుచందర్ వెల్లడించారు.
జగిత్యాలలో టెన్షన్.. టెన్షన్
కాగా.. ఈరోజు ఉదయం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. జగిత్యాల మండలం జాబితాపూర్‌లో తెల్లవారుజామున పని నుంచి ఇంటికి వెళ్తుండగా గంగారెడ్డి బైక్‌ను దుండగులు కారుతో ఢీకొట్టి.. కిందపడిన అతడిపై కత్తులతో దాడి చేశారు. దీంతో గంగారెడ్డి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. విషయం తెలిసిన వెంటనే కుటుంబసభ్యులు, స్థానికులు గంగారెడ్డిని జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.
Minister Nara Lokesh: యువగళం హామీలు నెరవేర్చడంలో మెటాతో ఎంవోయూ ఒక మైలురాయి
ఆస్పత్రి వద్దకు..
విషయం తెలిసిన వెంటనే జీవన్ రెడ్డి హుటాహుటిన ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. నిందితులను పట్టుకోవాలని జీవన్ రెడ్డి సహా పెద్దఎత్తున కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎమ్మెల్సీ తన అనుచరులతో జగిత్యాలలోని పాత బస్టాండ్ ఆవరణలో నడి రోడ్డుపై కూర్చొని ఆందోళనకు దిగారు. ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కూడా జీవన్‌రెడ్డితో కలిసి ఆందోళనకు దిగారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ కార్యకర్తల నినాదాలు చేశారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు. జగిత్యాలలో ఎవరి రాజ్యం నడుస్తోందని.. పోలీసులు ఎవరికి వత్తాసు పలుకుతున్నారంటూ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా చేస్తున్న ఎమ్మెల్సీతో ఎస్పీ అశోక్ మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చినప్పటి జీవన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. దాదాపు రెండు గంటలుగా ఎమ్మెల్సీ ఆందోళన చేశారు. మరోవైపు గంగారెడ్డిని హత్య చేసిన నిందితుడు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి...
TG Ministers: సియోల్‌లో టీ.మంత్రులు బిజీబిజీ.. నేడు ఏ ప్రాంతాల్లో పర్యటిస్తారంటే
ABN Effect: గాంధీలో నీటి కటకటకు తెర
Read Latest Telangana News And Telugu News
Updated Date - Oct 22 , 2024 | 03:37 PM