ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG News: కాంగ్రెసు నేత నర్సింగరావుపై ఎమ్మెల్యే సంజయ్ ఫైర్

ABN, Publish Date - May 28 , 2024 | 12:09 PM

కరీంనగర్ జిల్లా: కోరుట్ల కాంగ్రెస్ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావుపై కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ఫైర్ అయ్యారు. మానకొండూరులో గెలిచిన కాంగ్రెస్.. కోరుట్లలో ఎందుకు గెలవలేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగితే మళ్లీ తామే అధికారంలోకి వచ్చేవాళ్ళమని, మూడు, నాలుగుసార్లు ఓడినా నర్సింగరావుకు సానుభూతి రాలేదని అన్నారు.

కరీంనగర్ జిల్లా: కోరుట్ల (Korutla) కాంగ్రెస్ ఇంచార్జ్ (Congress Incharge) జువ్వాడి నర్సింగరావు (Juvvadi Narsingrao)పై కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) సంజయ్ (Sanjay) ఫైర్ (Fire) అయ్యారు. మానకొండూరులో గెలిచిన కాంగ్రెస్.. కోరుట్లలో ఎందుకు గెలవలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన కోరుట్లలో మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) జరిగితే మళ్లీ తామే అధికారంలోకి వచ్చేవాళ్ళమని, మూడు, నాలుగుసార్లు ఓడినా నర్సింగరావుకు సానుభూతి రాలేదని అన్నారు. నర్సింగరావు మొన్నటిదాకా ‘ఎలక్షన్ కా రాజా.. ఇప్పుడు కలెక్షన్ కా రాజా’ అని కోరుట్లలో ఆయన కలెక్షన్స్ మొదలు పెట్టారని విమర్శించారు. అసలు ఫోన్ ట్యాపింగ్ జరగలేదని. 15 రోజుల్లో ఈ కేసు మరిచిపోతారన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు సానుభూతితో గెలిచారని, ఐదు సార్లు ఓడినా నర్సింగరావుకు సానుభూతి కూడా రాలేదని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు.


కాగా నిన్న (సోమవారం) కోరుట్ల కాంగ్రెస్ ఇంఛార్జ్ జువ్వాడి నర్సింగరావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో తన ఓటమికి కేసీఆరే కారణమన్నారు. ఎమ్మెల్యేగా కల్వకుంట్ల సంజయ్ గెలుపులో ఆయన ప్రముఖ పాత్ర పోషించారన్నారు. ఎన్నికల సమయంలో తన పోన్‌ ట్యాప్ చేసి ప్రతి కదలికా తెలుసుకున్నారని ఆరోపించారు. ఇదే విషయాన్ని ఫోన్ ట్యాపింగ్ కేసులో అరస్టయిన రాధాకిషన్ వాగ్మూలం ఇచ్చారన్నారు. కేసీఆర్, ఎమ్మెల్యే సంజయ్‌కు నైతిక విలువలు లేవని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా కొనసాగే హక్కు సంజయ్‌కు లేదని.. వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్టీఆర్ స్పూర్తితో ముందుకు వెళతాం: పురందేశ్వరి

జగన్ సర్కార్ ఇందుకు మినహాయింపు..

చంద్రగిరిలో వైసీపీ గెలుపుపై అనుమానాలు..

సర్వేలు కూటమికి అనుకూలంగా ఉండడంతో..

ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 28 , 2024 | 12:12 PM

Advertising
Advertising