BRS: బాల్క సుమన్‌కు నోటీసులు జారీ చేసిన పోలీసులు..
ABN, Publish Date - Feb 11 , 2024 | 01:23 PM
మంచిర్యాల: మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌కు మంచిర్యాల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇటీవల బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు పిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాల్క సుమన్‌కు నోటీసులు జారీ చేస్తూ.. విచారణకు రావాలని ఆదేశించారు.

బాల్క సుమాన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. చెప్పు చూపిస్తూ వ్యవహరించిన ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో మంచిర్యాలలో కాంగ్రెస్ నేతలు, సీఎం రేవంత్ రెడ్డి అభిమానులు బాల్క సుమన్‌పై పిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై 294జి, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై విచారణకు హాజరు కావాల్సిందిగా కోరేందుకు కొద్ది రోజులుగా బాల్క సుమన్‌ను కలిసి నోటీసులుఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆయన తప్పించుకుని తిరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆదివారం పోలీసులు పోన్ చేయగా తాను హైదరాబాద్‌లో ఉన్నానని, అందుబాటులో ఉంటానని నోటీసులు ఇస్తే తీసుకుంటానని చెప్పడంతో కొద్ది సేపటి క్రితమే మంచిర్యాల పోలీసులు హైదరాబాద్‌కు బాల్క సుమన్‌కు నోటీసులు అందజేశారు.
Updated Date - Feb 11 , 2024 | 01:23 PM