ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Radha Kishan Rao: భారీ భద్రత నడుమ కరీంనగర్‌కు రాధా కిషన్ రావు

ABN, Publish Date - Apr 21 , 2024 | 11:45 AM

కరీంనగర్: టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు భారీ భద్రత నడుమ కరీంనగర్‌కు చేరుకున్నారు. ఆయన తల్లి ఆనారోగ్యంతో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో కోర్టు అనుమతితో ఆమెను చూసేందుకు ఆదివారం ఉదయం కరీంనగర్‌కు వచ్చారు.

కరీంనగర్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ (Task Force Ex DCP) రాధాకిషన్ రావు (Radha Kishan Rao) భారీ భద్రత నడుమ కరీంనగర్‌ (Karimnagar)కు చేరుకున్నారు. ఆయన తల్లి (Mother) ఆనారోగ్యంతో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో కోర్టు (Court) అనుమతితో ఆమెను చూసేందుకు ఆదివారం ఉదయం కరీంనగర్‌కు వచ్చారు. మీడియా కంట పడకుండా ఆస్పత్రి సెల్లార్ వరకు వాహనంలో తీసుకువెళ్లిన పోలీసులు .. అక్కడి నుంచి లిఫ్ట్‌లో తల్లి దగ్గరకు తీసుకువెళ్లారు. ఫోన్ టాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నిన్న మధ్యంతర బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే.


తన తల్లికి అనారోగ్య సమస్య కారణంగా ఆమెను చూసేందుకు బెయిల్ ఇవ్వాలని రాధ కిషన్ రావు న్యాయస్థానాన్ని కోరారు. మనవతా దృష్ట్యా ఆలోచించిన హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు అనుమతి ఇచ్చింది. పోలీస్ ఎస్కార్ట్ నడుమ జైల్ నుంచి కరీంనగర్‌కు రాధా కిషన్ రావ్ వచ్చారు.


రాధా కిషన్ రావు తల్లి ప్రస్తుతం కరీంనగర్ లో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అనారోగ్యంతో ఉన్న తన తల్లి దగ్గర కొద్ది గంటలు ఉండేందుకు రాధాకిషన్ రావు పర్మిషన్ కోరగా అందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఆదివారం ఉదయం పోలీస్ ఎస్కార్ట్ మధ్య జైల్ నుంచి కరీంనగర్‌కు రాధా కిషన్ రావ్‌ను తీసుకువచ్చారు. తన తల్లితో కొన్ని గంటలు గడిపిన తరువాత పోలీసులు తిరిగి రాధాకిషన్ రావును హైదరాబాద్ కు తీసుకురానున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రంగారెడ్డి జిల్లా: నడుస్తున్న కారులో మంటలు..

వెంకటగిరి టిక్కెట్టు విషయంలో టీడీపీ కీలక నిర్ణయం

రాయి తగిలితే హత్యాయత్నం.. గొడ్డలితో నరికితే గుండెపోటా?

పరారే.. పరారే.. పరిశ్రమలు పరారే!

Updated Date - Apr 21 , 2024 | 11:50 AM

Advertising
Advertising