Home » Radha Kishan Rao
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐదో నిందితుడు రిటైర్డ్ డీసీపీ రాధాకిషన్‌రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ప్రభుత్వం వివరణ సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావును విచారించేందుకు ప్రభుత్వం అనుమతించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో జైల్లో ఉన్న టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తనను బెదిరించి, కొట్టించి రూ.250కోట్ల విలువైన సంస్థను రాయించుకునే ప్రయత్నం చేసినట్లు బాఽధితుడు చెన్నుపాటి వేణుగోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అధికారులకు కోర్టులో చుక్కెదురైంది. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుపై అధికారులు ఇటీవల నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఆ అభియోగపత్రాలను పరిశీలించిన న్యాయమూర్తి అందులో వివరాలు, సమర్పించిన ఆధారాలు సమగ్రంగా లేవని పేర్కొంటూ..
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ (ఓఎస్డీ) పొట్లపల్లి రాధాకిషన్‌రావుకు నాంపల్లి కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. తన తల్లి సరోజినీ దేవి (98) సోమవారం మృతిచెందడంతో ఆమె అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతించాలని రాధాకిషన్‌రావు సోమవారం కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
బీఆర్‌ఎస్ పార్టీని వరుసగా మూడోసారి అధికారంలోకి తెచ్చేందుకే అప్పటి ఎస్‌ఐబీ చీఫ్ నేతృత్వంలో తామంతా కలిసి పనిచేసినట్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన కీలక నిందితుడు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ (ఓఎస్డీ) రాధాకిషన్ రావు తన నేరాంగీకార వాంగ్మూలంలో వెల్లడించారు. ‘‘2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రవణ్ కుమార్ నియోజకవర్గాలవారీగా నిర్వహించిన సర్వేలో.. బీఆర్‌ఎస్ పార్టీకి 50 సీట్లు కూడా రావని తేలింది.
కరీంనగర్: టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు భారీ భద్రత నడుమ కరీంనగర్‌కు చేరుకున్నారు. ఆయన తల్లి ఆనారోగ్యంతో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో కోర్టు అనుమతితో ఆమెను చూసేందుకు ఆదివారం ఉదయం కరీంనగర్‌కు వచ్చారు.