ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: ఎస్సై కొట్టారంటూ ఓ వ్యక్తి ఎంతపని చేశాడంటే..

ABN, Publish Date - Sep 26 , 2024 | 12:08 PM

Telangana: ఈనెల 22న ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్ర గాయపడిన శివప్రసాద్‌ను హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందంటూ వైద్యలు తెలిపారు. అయితే ఎస్సై కొట్టడం వల్లే సదరు వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డంటూ బాధితుడి సోదరి సోషల్ మీడియాలో వీడియోను విడుదల చేసింది.

The person tried to commit suicide by beating SI

జగిత్యాల, సెప్టెంబర్ 26: ఎస్సై కొట్టడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జగిత్యాల (Jagtial) జిల్లాలో చోటు చేసుకుంది. శివప్రసాద్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈనెల 22న ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్ర గాయపడిన శివప్రసాద్‌ను హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందంటూ వైద్యలు తెలిపారు. అయితే ఎస్సై కొట్టడం వల్లే సదరు వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డంటూ బాధితుడి సోదరి సోషల్ మీడియాలో వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారింది. ఎస్సై కొట్టడం వల్లే ఇంతటి దారుణం అంటూ శివప్రసాద్ సోదరి ఆరోపించారు.

Tirumala Laddu: తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు


అసలేం జరిగిందంటే..

జగిత్యాల జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల బావి ప్రాంతానికి చెందిన శివప్రసాద్‌కు కోరుట్లకుచెందిన కవితతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. అయితే గత కొన్ని సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు చోటు చేసుకున్నాయి. తరచూ దంపతులు ఇద్దరూ గొడవపడుతూనే ఉంటారని సమాచారం. అయితే ఇరువురి మధ్య గొడవలు తారాస్థాయికి చేరడంతో భార్య కవిత పోలీసులను ఆశ్రయించింది.

Vijayawada Durgamma: దుర్గమ్మ లడ్డూ ప్రసాదం తయారీలోనూ లోపాలు.. వెలుగులోకి నిజాలు



ఈనెల 19న శివప్రసాద్‌పై కవిత కోరుట్ల పోలీస్‌‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు ఈనెల 22 న శివ ప్రసాద్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తరువాత శివప్రసాద్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. అయితే కౌన్సిలింగ్ సమయంలో కోరుట్ల ఎస్ఐ శ్వేత తన అన్న శివ ప్రసాద్‌పై చేయి చేసుకుందని సోదరి ఆరోపిస్తోంది. తమకు న్యాయం చేయాలని బాధితుడి సోదరి వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది.


ఇవి కూడా చదవండి...

Tirumala Laddu: తెలంగాణ దేవాదాయ శాఖ అలర్ట్.. అన్ని ఆలయాల్లో

Madhavilatha: శ్రీవారికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా మాధవీలత ఏం చేశారంటే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 26 , 2024 | 01:17 PM