Viral: తెలంగాణ ఎమ్మెల్యేకు మహిళ నుంచి న్యూడ్ వీడియోకాల్.. ఎవరంటే..?
ABN, Publish Date - Oct 19 , 2024 | 09:04 AM
తెలంగాణలో ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకు మహిళ న్యూడ్ కాల్ చేయడం సంచలనం రేపుతోంది. ఈనెల 14వ తేదీన జరిగిన ఘటన ఎమ్మెల్యే ఫిర్యాదుతో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల కాలంలో మహిళలు కొందరు వ్యక్తులను టార్గెట్ చేసి మరీ.. వారి పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న ఘటనలు ..
మహిళలకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు న్యూడ్ కాల్స్ చేయడం, అసభ్యకరంగా మాట్లాడిన ఘటనలకు సబంంధించిన వీడియోలు, ఆడియోలు గతంలో ఎన్నో బయటకు వచ్చాయి. కొందరు నేతలు మహిళలను బెదిరించి లొంగదీసుకున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా హానీట్రాప్ ఘటనలు ఈ మధ్యకాలంలో ఎన్నో చూస్తున్నాం. పలుకుబడి, ఆర్థికస్థోమత కలిగిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని కొందరు మహిళలు మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఒకరిద్దరు బీజేపీ నాయకులు వేరే మహిళతో వీడియో కాల్‌లో అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకు మహిళ న్యూడ్ కాల్ చేయడం సంచలనం రేపుతోంది. ఈనెల 14వ తేదీన జరిగిన ఘటన ఎమ్మెల్యే ఫిర్యాదుతో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల కాలంలో మహిళలు కొందరు వ్యక్తులను టార్గెట్ చేసి మరీ.. వారి పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట మంచిగా మాట్లాడి.. తరువాత విషయాన్ని వీడియోలు తీసి బయటకు చెప్పడం, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న ఘటనలు చూస్తున్న నేపథ్యంలో తాజా ఘటన సంచలనంగా మారింది. అసలు ఆ మహిళ ఎవరు.. న్యూడ్ కాల్ చేయడం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే చర్చ మొదలైంది.
అవునా జగన్! మీరు అబద్ధాలే ఆడరా?
కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యేకు ఈనెల14వ తేదీన ఓ వీడియో కాల్ వచ్చింది. కాల్ ఎత్తిన వెంటనే ఓ మహిళ నగ్నంగా కనిపించడంతో వెంటనే.. ఆ ఎమ్మెల్యే ఫోన్ కట్ చేశారు. వీడియో కాల్ వచ్చిన ఫోన్ నెంబర్ ఎమ్మెల్యేకు తెలిసినది కాకపోవడం, ఒక్కసారిగా నగ్నంగా మహిళ కనబడటంతో ఎమ్మెల్యే షాకయ్యారు. దీంతో ఈనెల 17వ తేదీన హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన మహిళ ఎవరనేదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది.
కుట్ర చేశారా..
ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకు మహిళ నుంచి న్యూడ్ కాల్ రావడం వెనుక కుట్ర ఏమైనా దాగి ఉందా అనేకోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరైనా ఆమెతో చేయించారా.. అసలు ఫోన్ కాల్ చేసిన మహిళ ఏ ప్రాంతం నుంచి కాల్ చేశారు. ఆమె విదేశాల నుంచి వీడియో కాల్ చేశారా అనే వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఓ మహిళ ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్ చేయడం తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.
సహకార సంఘాలకు నామినేటెడ్ పాలకవర్గాలు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Latest Telugu News Click Here
Updated Date - Oct 19 , 2024 | 09:46 PM