ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

KCR: భూమిపుత్రుడు పుస్తకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్‌

ABN, Publish Date - May 18 , 2024 | 04:38 AM

తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు, వ్యవసాయ పురోభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్‌ చేసిన కృషిని వివరిస్తూ.. ఆపార్టీ నేత గోసుల శ్రీనివా్‌సయాదవ్‌ భూమిపుత్రుడు పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌ్‌సలో కేసీఆర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హరీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు, వ్యవసాయ పురోభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్‌ చేసిన కృషిని వివరిస్తూ.. ఆపార్టీ నేత గోసుల శ్రీనివా్‌సయాదవ్‌ భూమిపుత్రుడు పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌ్‌సలో కేసీఆర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హరీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

పన్నుల భారం మోపితే పోరాటమే: బీఆర్‌ఎస్‌

రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకు కాంగ్రెస్‌ సర్కారు జనంపై పన్నుల బాదుడు మొదలు పెట్టాలని చూస్తోందని బీఆర్‌ఎస్‌ నేతలు దేవిప్రసాద్‌, చిరుమళ్ల రాకేశ్‌ కుమార్‌ ఆరోపించారు. ప్రజలపై భారంమోపే ఏ నిర్ణయాన్నీ తమ పార్టీ ఆమోదించదని, ప్రజల పక్షాన పోరాడతామని అన్నారు. రాష్ట్రంలో బెల్టుషాపులు తగ్గిస్తామని ఎన్నికల సమయంలో రేవంత్‌ రెడ్డి చెప్పారని, ఇప్పుడు వాటిద్వారానే అధిక రాబడికోసం చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, డీఏ ప్రకటనపై క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.


40 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వండి: ఉద్యోగులు

ఉద్యోగులకు 40 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం సెంట్రల్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం ప్రతినిధులు పీఆర్‌సీ చైర్మన్‌ ఎన్‌.శివశంకర్‌ను శుక్రవారం కలిశారు. అడ్వాన్స్‌ పెంపు, లీవ్‌ ట్రావెల్‌ భత్యాల మంజూరు, హెల్త్‌కార్డులు, అదనపు పింఛను, పాత పింఛను విధానం అమలు, 5 నుంచి 25 సంవత్సరాల ఏఏఎస్‌, ఆర్జిత సెలవుల జమపై ఉన్న పరిమితిని ఎత్తివేయడం వంటి అంశాల మీద కమిషన్‌తో చర్చించినట్లు తెలిపారు. పీఆర్‌సీ కమిషన్‌ను కలిసిన వారిలో తెలంగాణ ఉద్యోగుల సంఘం సెంట్రల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మఠం రవీంద్ర కుమార్‌, ప్రధాన కార్యదర్శి హరీశ్‌కుమార్‌ రెడ్డి, పద్మ తదితరులు ఉన్నారు.

Updated Date - May 18 , 2024 | 04:38 AM

Advertising
Advertising