Kesineni Cinni: రాబోయే ఎన్నికల్లో కొడాలి నానికి డిపాజిట్ గల్లంతే
ABN, Publish Date - Jan 18 , 2024 | 05:46 PM
రాబోయే ఎన్నికల్లో గుడివాడ వైసీపీ ( YCP ) ఎమ్మెల్యే కొడాలి నాని ( Kodali Nani ) కి డిపాజిట్ గల్లంతేనని తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని ( Kesineni Chinni ) అన్నారు.
విజయవాడ: రాబోయే ఎన్నికల్లో గుడివాడ వైసీపీ ( YCP ) ఎమ్మెల్యే కొడాలి నాని ( Kodali Nani ) కి డిపాజిట్ గల్లంతేనని తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని ( Kesineni Chinni ) అన్నారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇతర పార్టీల నుంచి వలసలు కేవలం టీడీపీ, జనసేన పార్టీల్లోకే వస్తున్నాయన్నారు. ప్రజా ఆమోదం ఉన్న నాయకులు, కార్యకర్తలను మాత్రమే పార్టీలోకి తీసుకుంటున్నామని చెప్పారు. తెలుగుదేశంలోకి ఏ పదవులు ఆశించకుండానే నేతలు స్వతహాగా వస్తున్నారని కేశినేని చిన్ని తెలిపారు.
అలాంటి వారి చర్యలను తిప్పికొట్టాం
ఇతర పార్టీల్లో నుంచి వచ్చే నేతలను ఒకటికి నాలుగు సార్లు ఆలోచించిన తర్వాతే తీసుకుంటామన్నారు. కొంతమంది కోవర్టుళ్లాగా పార్టీలోకి వద్దామని అనుకుంటున్నారని.. అలాంటి వారిని పార్టీకి చాలా దూరంగా ఉంచుతామని హెచ్చరించారు. గుడివాడలో కొంతమంది టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారని అలాంటి వారి చర్యలను తిప్పికొట్టామన్నారు. కొడాలి నానికి సొల్లు కబుర్లు చెప్పడం మాత్రమే వచ్చునని ఎద్దేవా చేశారు. గుడివాడ ప్రజలంతా ఇక్కడ రౌడీ, బూతుల ఎమ్మెల్యేని ఎన్నుకున్నామని అంటున్నారని.. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆయనకు ఓటుతో గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. గతంలో కోవర్టు నేతలు టీడీపీలోకి వచ్చారని ఇప్పుడు వాళ్లంతా వెళ్లిపోయారన్నారు. రాబోయే ఎన్నికల్లో గుడివాడలో తెలుగుదేశం జెండాని కచ్చితంగా ఎగుర వేస్తామని కేశినేని చిన్ని ధీమా వ్యక్తం చేశారు.
Updated Date - Jan 18 , 2024 | 06:50 PM