ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Khammam : వైద్యం కోసం వచ్చి విగత జీవులై..

ABN, Publish Date - Jul 22 , 2024 | 03:25 AM

వైద్యం కోసం ఖమ్మం వచ్చి.. చికిత్స అనంతరం ఇంటికి తిరిగి వెళ్తుండగా అనూహ్యంగా దూసుకొచ్చిన కారు వారిపాలిట మృత్యుశకటమైంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో జగన్నాథపురం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు.

  • రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెలు మృతి

  • నలుగురికి తీవ్ర గాయాలు.. ఖమ్మం జిల్లాలో ఘటన

  • మృతులు ఎన్‌టీఆర్‌ జిల్లా వాసులు

చింతకాని, జూలై 21: వైద్యం కోసం ఖమ్మం వచ్చి.. చికిత్స అనంతరం ఇంటికి తిరిగి వెళ్తుండగా అనూహ్యంగా దూసుకొచ్చిన కారు వారిపాలిట మృత్యుశకటమైంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో జగన్నాథపురం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. ఏపీలోని ఎన్‌టీఆర్‌ జిల్లా వత్సవాయి మండలం కన్నెవీడు గ్రామానికి చెందిన కరిసే సుజాత అనారోగ్యంతో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు రెండు రోజుల క్రితం ఆమెను ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చారు.

చికిత్స అనంతరం ఆదివారం కుటుంబసభ్యులంతా ఆటోలో స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో చింతకాని మండలం జగన్నాథపురం దాటిన తరువాత ఎదురుగా వచ్చిన కారు బలంగా ఢీకొనడంతో వారు ప్రయాణిస్తున్న ఆటో రోడ్డు పక్కకు ఎగిరిపడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు చెల్లాచెదురుగా పడిపోయారు. పోలీసులు క్షతగాత్రులను 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటోలో ఉన్న కరిసే వెంకటరత్నం(50) ఘటనా స్థలంలోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడ్డ చెరుకుపల్లి హైమావతి(45) ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఆటోడ్రైవర్‌తో పాటు మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మృతి చెందిన వెంకటరత్నం, హైమావతి వరుసకు అన్నాచెల్లెల్లు.

Updated Date - Jul 22 , 2024 | 11:42 AM

Advertising
Advertising
<