Bhadrachalam: వీరలక్ష్మీ అలంకారంలో అమ్మవారి దర్శనం...
ABN, Publish Date - Oct 11 , 2024 | 08:24 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలోని లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం 8 వ రోజు వీరలక్ష్మీ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం (Bhadrachalam) సీతారామచంద్రస్వామి (Sitaramachandra Swamy) ఆలయం (Temple)లోని లక్ష్మీతాయారు అమ్మవారి (Laksmithayaru Ammavaru) ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం 8 వ రోజు వీరలక్ష్మీ (Veeralakshmi) అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అలాగే 12 వ తేదీ (శనివారం) విజయదశమి సందర్భంగా అమ్మవారు నిజరూప(మహాలక్ష్మి) దర్శనం ఇస్తారు. సాయంత్రం దసరా మండపంలో శమీ పూజ, ఆయుధ పూజ, శ్రీరామలీల (రావణ వధ) మహోత్సవం నిర్వహిస్తారు. కాగా12న (శనివారం) విజయదశమి సందర్భంగా భద్రాద్రి రామయ్యకు పట్టాభిషేకం, విజయోత్సవం, ఆయుధపూజ, శ్రీరామ్‌లీలా మహోత్సవం నిర్వహించనున్నారు. అక్టోబర్ 17న శబరి స్మృతియాత్ర సయితం నిర్వహిస్తారు.
కాగా ఏడో రోజు గురువారం అమ్మవారు ఐశ్వర్యలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధిస్తే శాసకత్వం, వాక్కు ప్రభావం, అనంత ఐశ్వర్యం కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు. సాయంత్రం నిర్వహించిన సామూహిక కుంకుమార్చనకు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజలు చేశారు. అలాగే చిత్రకూట మండపంలో రామాయణ పారాయణోత్సవాల్లో భాగంగా వేదపండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాగా ఈ నెల 17న భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో శబరి స్మృతి యాత్ర నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. 17న ఉదయం 6:30 నుంచి 8:30 గంటల వరకు గిరి ప్రదక్షిణ, చిత్రకూట మండపంలో 8:30 నుంచి 11:30 వరకు నిత్య కల్యాణం, 11:30 నుంచి 12 గంటల వరకు స్వామివారికి వివిధ పుష్ప, ఫలార్చన, మంత్రపుష్పం, ప్రసాద వినియోగం ఉంటుందని పేర్కొన్నారు. ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు స్వామివారి ప్రచార రథంతో వినాయకపురం నుంచి ముత్యాలమ్మ ఆలయం వరకు శోభాయాత్ర, ఉదయం 10:30 నుంచి 12:30 వరకు ముత్యాలమ్మ ఆలయం వద్ద భద్రాచల స్వామివారి ప్రచారమూర్తుల కల్యాణోత్సవం, అన్నప్రసాద వితరణ ఉంటుందని ఈవో వివరించారు. కాగా శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులపాటు రోజుకో అలంకారంలో శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎనిమిదవ రోజుకు చేరుకున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు..
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక నిర్ణయం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Oct 11 , 2024 | 08:24 AM