ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhatti Vikramarka: చరిత్రలో 1948, సెప్టెంబర్ 17 గురించి డిప్యూటీ సీఎం ఏం చెప్పారంటే...

ABN, Publish Date - Sep 17 , 2024 | 02:02 PM

Telangana: చరిత్రలో 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 76 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ, నాటి హైదరాబాద్ సంస్థానం రాజుల పాలన నుంచి భారతదేశంలో అంతర్భాగంగా మారి ప్రజాస్వామ్య ప్రజాపాలన దశలోకి పరివర్తన చెందిందని తెలిపారు.

Deputy CM Bhatii Vikramarka

ఖమ్మం, సెప్టెంబర్ 17: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం నాడు పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. చరిత్రలో 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉందని తెలిపారు. 76 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ, నాటి హైదరాబాద్ సంస్థానం రాజుల పాలన నుంచి భారతదేశంలో అంతర్భాగంగా మారి ప్రజాస్వామ్య ప్రజాపాలన దశలోకి పరివర్తన చెందిందని తెలిపారు.

TTD EO: తిరుమలలో ఏర్పాట్లపై మంత్రికి భక్తుడి ఫిర్యాదులో ట్విస్ట్.. అసలేం జరిగిందో చెప్పిన ఈవో


తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడం కోసం ఆనాటి యావత్ సమాజం ఉద్యమించిందని గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించిందన్నారు.


48 గంటల్లోనే రెండు గ్యారెంటీలు..

చివరి వరుసలోని పేదలకు కూడా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందే లక్ష్యంతో ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి దరఖాస్తులను స్వీకరించి అర్హులైన లబ్ధిదారులకు పథకాల ఫలాలు అందించడం జరుగుతోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గ్యారెంటీ పథకాలను అందించే దిశగా జిల్లాలోని ఎంపీడీఓ కార్యాలయాలు, సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేశామని డిప్యూటీ సీఎం చెప్పారు. హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే అమలు చేసి చరిత్ర సృష్టించిందన్నారు. ఆడ బిడ్డలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని.. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకూ రాష్ట్రంలో 87.12 కోట్ల ఉచిత ప్రయాణాలు మహిళలు చేశారన్నారు. ఉచిత ఆర్టీసీ పథకం ద్వారా  మహిళలకు 2958 కోట్ల రూపాయలు ఆదా చేయగలిగామన్నారు. ఈ పథకం ద్వారా ఖమ్మం జిల్లాలో మహిళలకు దాదాపు 1,79,97,210 పైగా జీరో టికెట్లను జారీ చేశామని.. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలు దాదాపు 8432.83 లక్షల రూపాయలను ఆదా చేశారని చెప్పారు.

Telangana DGP: ఏ సమయానికి నిమజ్జనాలు పూర్తవుతాయో చెప్పిన డీజీపీ



రూ.500 కే వంటగ్యాస్ సిలెండర్

రూ. 500 కే వంటగ్యాస్ సిలెండర్ పంపిణీ ఆడబిడ్డల కన్నీళ్లు తుడవాలన్న లక్ష్యంతో ప్రారంభించిందే మహాలక్ష్మి పథకంలోని మరో పథకం 500 రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వాలన్న ఆలోచన అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 27న ప్రారంభించామన్నారు. 40 లక్షల మంది లబ్ధిదారులతో మొదలైన ఈ పథకం ప్రస్తుతం రాష్ట్రంలో 42.90 లక్షల మంది లబ్ధి పొందుతున్నారన్నారు. ఖమ్మం జిల్లాలో  ఇప్పటి వరకు 3 లక్షల 94 వేల 753 మంది వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లను సబ్సీడిపై సరఫరా చేసి సంబంధిత లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలలో 1119.71 లక్షల రూపాయలు సబ్సిడీ సొమ్ము జమ చేశామన్నారు.


ప్రతీ ఇంటికి ఉచిత వెలుగులు..

గృహజ్యోతితో పేదల ఇంట వెలుగులు అల్పాదాయ వర్గాలవారికి విద్యుత్ బిల్లుల భారం తగ్గించి, వారి గృహాలలో చీకట్లను పారద్రోలి, విద్యుత్ కాంతులను నింపేందుకు గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నామన్నారు. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నామన్నారు. ఈ పథకాన్ని 2024 మార్చిలో ప్రారంభించామని చెప్పారు. రాష్ట్రంలో 48 లక్షల 62 వేల 682 మంది గృహజ్యోతి  పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు. 2024 మార్చి 1 నుంచి ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో 2,57,995 వినియోగదారులకు నెలకు రూ. 9.48 కోట్ల సబ్సీడి చొప్పున ఆగస్టు 2024 వరకు రూ. 49.97 కోట్లు సబ్సీడీ ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ వచ్చినప్పటికీ ఎటువంటి కోతలు లేకుండా అన్ని రంగాల వారికి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

KTR: వాళ్ల మెప్పు కోసమే రాజీవ్ విగ్రహ స్థాపన

Atishi: అతిషి పోలిటికల్ ఎంట్రీ ఎలా జరిగిందంటే..?

Read LatestTelangana NewsAndTelugu News

Updated Date - Sep 17 , 2024 | 02:45 PM

Advertising
Advertising