ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhadrachalam: మూడో ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి వరద ఉధృతి

ABN, Publish Date - Jul 23 , 2024 | 06:57 AM

భద్రాద్రి కొత్తగూడెం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. 51.10 అడుగుల వద్ద 13,18,860 క్యూసెక్కుల వరద ఉధృతి పెరిగింది. 53 అడుగులు దాటగానే మూడో ప్రమాద హెచ్చరిక జారీ కానుంది.

భద్రాద్రి కొత్తగూడెం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో (Heavy Rains) గోదావరి (Godavari) ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక (Third hazard warning) దిశగా గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. 51.10 అడుగుల వద్ద 13,18,860 క్యూసెక్కుల వరద ఉధృతి పెరిగింది. 53 అడుగులు దాటగానే మూడో ప్రమాద హెచ్చరిక జారీ కానుంది.


కాగా సోమవారం అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మేడిగడ్డ వద్ద ఏకంగా 9 మీటర్ల ఎత్తున ప్రవాహం కొనసాగుతోంది. మరోవైపు కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలానికి భారీ వరద వస్తోంది. జూరాలతోపాటు తుంగభద్ర నుంచీ నీటిని విడుదల చేయడంతో సుమారుగా 2లక్షల క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. రాష్ట్రంలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా.. పలు వాగులు, వంకలు ఇంకా ఉప్పొంగి ప్రవహిస్తూనే ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో కల్వర్టులు, రోడ్లు కొట్టుకుపోగా.. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. మరోవైపు.. వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీఎస్‌ శాంతికుమారి ఆదేశించారు. భద్రాచలం వద్ద నాలుగు రోజులుగా క్రమంగా పెరుగుతూ వచ్చిన ప్రవాహం.. సోమవారం అర్ధరాత్రి వరకు 50.6 అడుగులకు చేరింది.


ఎగువ నుంచి భారీగా వరద కొనసాగుతుండడంతో మంగళవారం తుది ప్రమాద హెచ్చరిక (53 అడుగులు) దాటే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరం ఉధృతితొ దేవస్థానానికి సంబంధించిన స్నానఘట్టాల వద్ద ఉన్న కల్యాణ కట్ట కింది భాగం పూర్తిగా మునిగిపోయింది. ముంపు బారిన పడే అవకాశం ఉందన్న అంచనాతో 111 గ్రామాల ప్రజలను అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తం చేసింది. తుది ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే.. దుమ్ముగూడెం, చర్ల మండలాల్లోని పలు గ్రామాల్లోకి నీరు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా, భద్రాచలం వద్ద కరకట్టను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. అనంతరం భద్రాచలం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి, గతంలో తలెత్తిన లోపాలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. మరోవైపు.. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీకి వరద పోటెత్తుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలవరానికి 12,157 కోట్లివ్వండి

ఐదేళ్లుగా అశాంతి!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 23 , 2024 | 07:12 AM

Advertising
Advertising
<