ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: అనుమతి లేకుండా బయటకొచ్చిన విద్యార్థులకు అనుకోని ప్రమాదం..

ABN, Publish Date - Aug 10 , 2024 | 03:44 PM

Telangana: వారంతా ఆశ్రమ పాఠశాల విద్యార్థులు.. ఇంటికి దూరంగా ఉంటూ ఆశ్రమంలో చదువుతున్నారు. వీరు ఇంటికి వెళ్లాలంటే ఆశ్రమ సిబ్బంది పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. లేదా తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్తుంటారు. కానీ కొత్తపల్లి ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఎలాంటి అనుమతి లేకుండానే బయటకు వచ్చారు.

Road Accident in Bhadradri kothagudem

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 10: వారంతా ఆశ్రమ పాఠశాల విద్యార్థులు.. ఇంటికి దూరంగా ఉంటూ ఆశ్రమంలో చదువుతున్నారు. వీరు ఇంటికి వెళ్లాలంటే ఆశ్రమ సిబ్బంది పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. లేదా తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్తుంటారు. కానీ కొత్తపల్లి ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఎలాంటి అనుమతి లేకుండానే బయటకు వచ్చారు. ఇదే వారి పాలిట శాపంగా మారింది. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో మిగిలిన విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెంలో (Bhadradri kothagudem) ఈ ఘటన చోటు చేసుకుంది.

Vinesh Phogat: వినేశ్ ఫొగట్ అప్పీల్‌పై నేడే తీర్పు.. రాత్రి 9.30 కోసం భారతావని ఎదురుచూపు


జిల్లాలోని దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థులు అనుమతి లేకుండా బయటకు వచ్చారు. నలుగురు విద్యార్థులు ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కారు. అయితే తునికి చెరువు దగ్గర ఆటో ప్రమాదానికి గురైంది. వేగంగా దూసుకొచ్చిన కార్.. విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతి చెందింది. కుంజాదీపక్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. మృతి చెందిన విద్యార్థి దుమ్ముగూడెం మండలం బండారీ గూడెంగా తెలుస్తోంది.

Cibil Score: సిబిల్ స్కోర్ విషయంలో ఆర్బీఐ కొత్త రూల్.. తెలిస్తే మీకే లాభం


ఆటోలో మిగిలిన విద్యార్థులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అల్లూరి జిల్లా ఎటపాక పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం జరిగింది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

BSNL: బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్.. జియో, ఎయిర్‌టెల్‌కు చుక్కలే..

TG News: ఇన్‌స్టా గ్రామ్‌ పరిచయమే శాపంగా మారి ఆ యువతిని...

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 10 , 2024 | 03:48 PM

Advertising
Advertising
<