Suicide: ఎస్ఐ సూసైడ్ వ్యవహారంలో సంచలన విషయాలు
ABN, Publish Date - Dec 02 , 2024 | 11:58 AM
ములుగు జిల్లా, వాజేడు మండలం ఎస్ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంట్లో వేరే పెళ్లి సంబంధం చూస్తుండడంతో ఎస్ఐ మనస్థాపానికి గురయ్మారు. పెళ్లి వ్యవహారంతోనే మనస్థాపానికి గురై గన్‌తో కాల్చుకొని చనిపోయారు. దీంతో ఎస్ఐ హరీష్ స్వంత గ్రామం గొరికొత్తపల్లి మండలం, వెంకటేశ్వర్లుపల్లిలో విషాదం నెలకొంది.
జయశంకర్ భూపాలపల్లి: ములుగు జిల్లా, వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ (SI Rudrarapu Harish) ఆత్మహత్య (Suicide) వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం రాత్రి తన గర్ల్ ఫ్రెండ్ (Girlfriend)తో పూసూరు గోదావరి బ్రిడ్జి సమీపంలోని ఫెరిడో రిసార్ట్స్‌కు వెళ్ళారు. ఇంట్లో వేరే పెళ్లి సంబంధం చూస్తుండడంతో ఎస్ఐ మనస్థాపానికి గురయ్మారు. పెళ్లి వ్యవహారంతోనే మనస్థాపానికి గురై గన్‌తో కాల్చుకొని చనిపోయారు. దీంతో ఎస్ఐ హరీష్ స్వంత గ్రామం గొరికొత్తపల్లి మండలం, వెంకటేశ్వర్లుపల్లిలో విషాదం నెలకొంది. ఎస్ఐకు 10 రోజుల క్రితమే పెళ్లి నిశ్చయమైంది. సొంత గ్రామంలో కొత్త ఇళ్ళు నిర్మాణం కూడా చేపట్టారు.
కాగా ములుగు జిల్లా, వాజేడు మండలం ఎస్ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్య చేసుకున్నారు. పూసూరు గోదావరి బ్రిడ్జి సమీపంలోని ఫెరిడో రిసార్ట్స్‌లో తుపాకితో కాల్పుచుకుని చనిపోయారు. ఆదివారం వెళ్లిన ఎస్ఐ రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో వేసి చూసిన స్టేషన్ సిబ్బంది సోమవారం ఉదయం రిసార్డ్స్‌కు వెళ్లి చూడగా హరీష్ విగతజీవిగా కనిపించారు.
ఎస్ఐ నిన్న (ఆదివారం) రిసార్ట్స్‌లో గది అద్దెకు తీసుకుని ఉన్నారు. ఎవరు ఫోన్ చేసిన ఆయన అందుబాటులోకి రాలేదు. ఆయన ఆత్మహత్యకు ఇంట్లో కుటుంబ కలహాలు, వ్యక్తిగత కారణంగా సమాచారం. రిసార్ట్స్ సిబ్బంది ఎన్ని సార్లు డోర్ కొట్టినా తలుపు తెరవలేదు. దీంతో సోమవారం ఉదయం వాజేడు పోలీసులకు సిబ్బంది సమాచారం అందించారు. పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకున్న తర్వాత రిసార్ట్స్ సిబ్బంది డోర్ పగులగొట్టి చూడగా ఎస్ఐ విగతజీవిగా పడి ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పులి జాడ కోసం కాగజ్‌నగర్ అడవుల్లో అన్వేషణ
కార్తీక మాసం చివరి రోజు పోలి పాడ్యమి..
ములుగు ఏజన్సీలో టెన్షన్ టెన్షన్..
చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కీలక భేటీ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Dec 02 , 2024 | 12:07 PM