Bhadradri: రెండవ రోజు కొనసాగుతున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
ABN, Publish Date - Apr 10 , 2024 | 07:30 AM
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో రెండవ రోజు బుధవారం వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఈ రోజు మండల లేఖ, కుండ, కలశ, యాగశాల అలంకరణ జరగనుంది. సాయంత్రం సార్వభౌమ వాహన సేవ జరుగుతుంది.
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామ చంద్ర స్వామి (Sri Sitarama Chandra Swamy) వారి దేవస్థానంలో రెండవ రోజు బుధవారం వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు (Sri Rama Navami Brahmotsavalu) కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఈ రోజు మండల లేఖ, కుండ, కలశ, యాగశాల అలంకరణ జరగనుంది. సాయంత్రం సార్వభౌమ వాహన సేవ జరుగుతుంది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 23వ తేదీ వరకు నిత్యకళ్యాణాలు, దర్బారు సేవ రద్దు చేసినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.
భద్రాద్రి రామయ్య కల్యాణానికి అంకురార్పణ
కాగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఉత్సవాంగ స్నపనంతో వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు శ్రీకారం చుట్టారు. తొలుత శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం స్వామివారికి ఆరాధన, ఉగాది ప్రసాద నివేదన చేశారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే రుత్వికులకు, సిబ్బందికి భద్రాద్రి దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి దంపతులు దీక్ష వస్త్రాలను అందజేశారు. మూలవరులకు అభిషేకం, బేడా మండపంలో ఉత్సవమూర్తులకు ఉత్సవాంగస్నపనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం గోవిందరాజస్వామి ఆలయానికి శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులను తీసుకెళ్లి మృత్సంగ్రహణాన్ని సంప్రదాయబద్దంగా నిర్వహించారు భూ వరాహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మట్టిని సేకరించి కల్యాణ అంకురార్పణకు వినియోగించారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో భద్రాద్రి రామయ్య ఆదాయం పెరగనుందని వ్యయం తగ్గే అవకాశాలున్నాయని స్థానాచార్యులు కేఈ స్థలశాయి తెలిపారు. భద్రాచలంలో మంగళవారం రాత్రి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని నిత్యకల్యాణ మండపం వద్ద పంచాంగ పఠనం చేశారు.
Updated Date - Apr 10 , 2024 | 07:34 AM