ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Godavari: భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

ABN, Publish Date - Jul 28 , 2024 | 07:18 AM

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53.40 అడుగుల వద్ద 14,45,047 క్యూసెక్కుల వరద ప్రవాహిస్తుండడంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రహదారులపై వరద నీరు పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం ఏజెన్సీ జల దిగ్బంధంలో చిక్కుకుంది.

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి (Godavari) పరవళ్ళు తొక్కుతోంది. గోదావరి నీటిమట్టం 53.40 అడుగుల వద్ద 14,45,047 క్యూసెక్కుల వరద ప్రవాహిస్తుండడంతో మూడో ప్రమాద హెచ్చరిక (Third Hazard Warning) కొనసాగుతోంది. రహదారులపై వరద నీరు పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం ఏజెన్సీ జల దిగ్బంధంలో చిక్కుకుంది. భద్రాచలం నుంచి ఆంధ్రా, ఒడిషా, ఛత్తీస్ గడ్ వెళ్ళే జాతీయ రహదారి.. దుమ్ముగూడెం చర్ల స్టేట్ హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే భద్రాచలం నుంచి బూర్గంపాడు రహదారిపై కూడా రాకపోకలు నిలిచిపోయాయి.


నిలిచిపోయిన రాకపోకలు..

కాగా శనివారం సాయంత్రం 4.16 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరుకోవడంతో ఆర్డీవో దామోదర్‌రావు మూడో(తుది) ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఆరు గంటలకు గోదావరి నీటి మట్టం 53.4 అడుగులకు చేరింది. దీంతో భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు, అశ్వాపురం, పినపాక మండలాల్లోని 34 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. భద్రాచలం-వాజేడు, భద్రాచలం-కూనవరం, భద్రాచలం-చర్ల మార్గంలో పలు ప్రాంతాల్లో రహదారులపై గోదావరి వరద ప్రవహిస్తోంది. దీంతో భద్రాచలం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంలోని అశోక నగర్‌ కొత్తకాలనీ, ఏఎంసీ కాలనీలు నీట మునిగాయి. మొత్తం 94 కుటుంబాలకు చెందిన 306 మందిని పునరావాస కేంద్రాలకు చేర్చారు.


ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి తుమ్మల..

భద్రాద్రి సరిహద్దున ఉన్న ఏపీలోని ఎటపాక పెద్దవాగు పొంగి ప్రవహిస్తుండడంతో ఆ నీరు ఈ కాలనీల్లోకి వచ్చింది. రెండు రోజులుగా చర్ల మండలంలో కురుస్తున్న భారీ వర్షాలతో మండలం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గోదావరి వరద రోడ్లపైకి చేరడంతో భద్రాచలం, వెంకటాపురం, చర్ల మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటవీ ప్రాంతాల్లో వాగులు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాగా, గోదావరి నీటిమట్టం 75 అడుగులకు చేరినా.. భద్రాచలంలోకి చుక్క నీరు రానివ్వకుండా చేసే బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. నూతనంగా చేపట్టిన 700 మీటర్ల కరకట్ట నిర్మాణాన్ని వచ్చే జూన్‌ నాటికి పూర్తి చేస్తామని పేర్కొన్నారు. శనివారం భద్రాచలంలోని ముంపు ప్రాంతాలను, నూతనంగా నిర్మిస్తున్న కరకట్టను ఆయన పరిశీలించారు.


శ్రీశైలానికి భారీ వరద..

కృష్ణా నదికి ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు రెండు రోజుల్లో నిండే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం జలాశయానికి 4.12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. జలవిద్యుత్‌ ఉత్పాదన చేసి 74,258 క్యూసెక్కులను వదిలిపెట్టారు. ప్రాజెక్టు సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 127.6 టీఎంసీల నీరు ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ నుంచి 2వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌ ధ్వంస రచన.. అబద్ధాలే ఆలంబన!

పదేళ్లలో ఏపీ అగ్రగామి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 28 , 2024 | 07:18 AM

Advertising
Advertising
<